గుండెపై అమ్మ ఫోటో.. అభిమానికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన లారెన్స్

గుండెపై అమ్మ ఫోటో.. అభిమానికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన లారెన్స్

ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్(Raghava lawrence), దర్శకుడు ఎస్ జే సూర్య(Surya) ప్రధాన పాత్రల్లో వస్తున్న లేటెస్ట్ మూవీ జిగర్ తాండ డబుల్‌ ఎక్స్‌(jigarthanda double x). దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు(Karthik subaraj) తెరకెక్కించిన ఈ సినిమా నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. 

ఈ ఈవెంట్ లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఈవెంట్ లో లారెన్స్ మాట్లాడుతున్న సమయంలో ఓ అభిమాని పరిగెత్తుకుంటూ స్టేజిమీదకు వచ్చి లారెన్స్‌ కాళ్లపై పడబోయాడు. వెంటనే లారెన్స్‌ అభిమానిని తన కాళ్లపై పడకుండా ఆపి.. ఆయనే అభిమాని కాళ్లకు దండం పెట్టారు. లారెన్స్ చేసిన పనికి అక్కడనున్న వాళ్లంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. 

అంతేకాదు.. లారెన్స్‌ తన దగ్గరికి వచ్చిన ఆ అభిమానితో చాలా ప్రేమగా మాట్లాడారు. లారెన్స్‌ తన తల్లికి గుడి కట్టాడాన్ని స్పూర్తిగా తీసుకున్న ఆ అభిమాని.. తన తల్లి ఫోటోను గుండెలపై పచ్చ బొట్టు వేయించుకున్నానని చెప్పాడు. దానికి చాలా సంతోషించిన లారెన్స్‌..  అతన్ని గట్టిగా హత్తుకుని గుండెలపై ఉన్న అమ్మ ఫొటోకు ముద్దు పెట్టారు. దీంతో ఆ అభిమాని ఆనందానికి ఆవడలు లేకుండా పోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.