ఏసీబీకి దొరికిన HMWS ఉద్యోగి

ఏసీబీకి దొరికిన HMWS ఉద్యోగి

హైదరాబాద్ : గోశామహల్ లోని HMWS సూపరింటెండెంట్ అహ్మద్… లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికాడు. కాంట్రాక్ట్ కార్మికుడి దగ్గర ఐదు వేల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు అహ్మద్ ను విచారిస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికుడిగా చేస్తోన్న కృష్ణ తనకు రావాల్సిన ఆరు నెలల డబ్బులను మంజూరు చేయాలని అడిగాడు. ఇందుకు సూపరింటెండెంట్ ఐదు వేలు డిమాండ్ చేయడంతో.. ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు.