కేరళ సీఎం కూతురిపై మనీలాండరింగ్​ కేసు

కేరళ సీఎం కూతురిపై  మనీలాండరింగ్​ కేసు

 కొచ్చి: కేరళ సీఎం పినరయి విజయన్​ కుమార్తె వీణా విజయన్​తోపాటు మరికొందరిపై ఈడీ అక్రమ నగదు చలామణి చట్టం(పీఎంఎల్ఏ)  కింద కేసు నమోదు చేసింది. ఆమె ఐటీ కంపెనీకి ఓ ప్రైవేట్​ సంస్థ నుంచి అక్రమ చెల్లింపులు జరిగినట్టు ఆరోపించింది. ఈ కేసు విచారణకు సంబంధించి వీణాతోపాటు మిగతవారికి సమన్లు జారీచేయనుంది. సీరియస్​ ఫ్రాడ్​ ఇన్వెస్టిగేషన్​ ఆఫీస్(ఎస్​ఎఫ్​ఐఓ)​ ఫిర్యాదు ఆధారంగా ఈడీ  ఈ కేసు పెట్టింది.

 కొచ్చిన్​ మినరల్స్​ అండ్​ రూటైల్​ లిమిటెడ్​(సీఎంఆర్​ఎల్​) అనే ప్రైవేట్​ సంస్థ వీణాకు చెందిన ఐటీ కంపెనీ ఎక్సాలాజికల్​ సొల్యూషన్​కు 2018 నుంచి 2019 మధ్య రూ.1.72 కోట్లు అక్రమంగా చెల్లించినట్టు ఇన్​కం ట్యాక్స్​ డిపార్ట్​మెంట్​ గుర్తించింది. ఎలాంటి సేవలు అందించకుండానే ఈ చెల్లింపులు జరిగినట్టు ఐటీశాఖ పేర్కొంది.