ఈడీ సమన్లపై హైకోర్టును ఆశ్రయించిన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్

ఈడీ సమన్లపై హైకోర్టును ఆశ్రయించిన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్

మనీలాండరింగ్ కేసులో ఈడీ సమన్లపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శనివారం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.ఈడీ సమన్లు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ సోరెన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు సెప్టెంబర్ 18న మనీలాండరింగ్ ఆరోపణల కేసులో ED సమన్లకు వ్యతిరేకంగా సోరెన్ చేసిన పిటిషన్‌ను స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. 

అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను అనుసరించి సోరెన్ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నాడు. ఈ వ్యవహారంలో ఉపశమనం కోసం జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించే స్వేచ్ఛను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం సోరెన్‌కు ఇచ్చింది.

ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ సోరెన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు . ఈ కేసు కేంద్రం చేసిన స్పష్టమైన “చట్టాన్ని దుర్వినియోగం” చేసిందని , ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం అని ఆరోపించారు.

భూ కుంభకోణం కేసుకు సంబంధించి 2023 ఆగస్టులో సీఎం హేమంత్ సోరేన్ కు ఈడీ సమన్లు పంపింది. అయితే జార్ఖండ్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సన్నాహాల్లో బిజీగా ఉన్నానని  విచారణను దాటవేశారు. సోరెన్‌ను ఆగస్టు 24, సెప్టెంబర్ 9 తేదీల్లో మళ్లీ హాజరు కావాలని కోరింది. అయినప్పటికీ హేమంత్ సోరేన్ దర్యాప్తు ఏజెన్సీ ముందు హాజరు కాలేదు.