
ఓ వైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్న పూజాహెగ్డే.. మరోవైపు స్పెషల్ సాంగ్స్‌తోనూ ఆకట్టుకుంటోంది. రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ‘కూలీ’ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసిందామె. రీసెంట్‌గా ఈ సాంగ్ ప్రోమోను విడుదల చేసిన మేకర్స్.. శుక్రవారం ఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘మై డియర్ మోనిక.. లవ్ యు మోనిక..’ అంటూ సాగే ఈ మాస్ బీట్ సాంగ్‌ను అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేయడంతో పాటు శుభలక్ష్మితో కలిసి హై ఎనర్జీతో పాడాడు.
కృష్ణకాంత్ లిరిక్స్ రాశారు. అసల్ కోలార్ రాప్ పాటకు ఫ్రెష్‌నెస్‌ను యాడ్ చేసింది. పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో చిత్రీకరించిన ఈ పాటలో రెడ్ కలర్ కాస్ట్యూమ్స్‌లో కనిపించిన పూజాహెగ్డే.. తనదైన డ్యాన్స్ మూమెంట్స్‌తో ఇంప్రెస్ చేసింది. తనతోపాటు మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ ఇందులో కనిపించాడు. నాగార్జున, ఆమీర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతిహాసన్ లాంటి స్టార్స్ నటిస్తున్న యాక్షన్ మూవీని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఆగస్టు 14న సినిమా విడుదల కానుంది.