రూ.1లక్ష ఉన్న బ్యాగ్ తో కోతి జంప్.. చివరికేమైందంటే..

రూ.1లక్ష ఉన్న బ్యాగ్ తో కోతి జంప్.. చివరికేమైందంటే..

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఓ కోతి నిమిషాల్లోనే 'మిలియనీర్'గా మారిపోవాలని చూసింది. మామూలుగా కోతులు ఇంట్లోని వస్తువులు, పండ్లు లేదా కూరగాయలు తీసుకెళ్లడం చూసి ఉంటాం. రూ.లక్ష నగదు ఉన్న బ్యాగును కోతి దొంగిలించడం ఎప్పుడైనా చూశారా. అయితే ఇప్పుడు చూసేయండి. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా కెమెరాకు చిక్కడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జూలై 4న షహాబాద్‌లోని రిజిస్ట్రీ కార్యాలయానికి సేల్ డీడ్ కోసం వచ్చిన షరావత్ హుస్సేన్ అనే  వ్యక్తి మోటార్‌సైకిల్‌ను పార్క్ చేసి, పక్కనే ఉన్న బెంచ్ పై కూర్చున్నాడు. అలా తన పనుల్లో నిమగ్నమై ఉండగా.. ఆ సమయంలో అక్కడికి సడెన్ గా వచ్చిన ఓ కోతి పార్క్ చేసిన బైక్ కు వేలాడదీసిన రూ.లక్ష నగదు ఉన్న బ్యాగును కోతి ఎత్తుకెళ్లి చెట్టుపైకి ఎక్కింది. అలా కాసేపటి తర్వాత స్థానికులంతా కలిసి ఆ కోతిని తరిమేశారు. ఎట్టకేలకు హుస్సేన్ తన బ్యాగుతో పాటు రూ.1లక్ష నగదును కూడా తిరిగి పొందగలిగాడు.

షహాబాద్‌లో కోతుల బెడద పెరుగుతున్న దృష్ట్యా  వాటిని పట్టుకుని అడవుల్లో విడిచిపెట్టేందుకు ఒక బృందాన్ని నియమించనున్నట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. కోతుల బెడదను అరికట్టేందుకు తహసీల్ స్థాయిలో కోతులను పట్టుకుని అడవుల్లో వదలడం జరుగుతుందని షహాబాద్ డిప్యూటీ కలెక్టర్ అనిల్ కుమార్ తెలిపారు.