ఉప్లా గ్రామంలో కోతుల పేరు మీద 32 ఎకరాల భూమి

ఉప్లా గ్రామంలో కోతుల పేరు మీద 32 ఎకరాల భూమి

సాధారణంగా భూమి పట్టా వ్యక్తుల పేరు మీదనో, లేదంటే ఏదైనా ఛారిటీ, కంపెనీల పేరు మీద ఉండడం అందరికీ తెలిసిందే. కానీ జంతువుల పేరు మీద కూడా భూమి ఉండడం ఎక్కడైనా చూశారా.. ఔను మహారాష్ట్ర ఉస్మానాబాద్‌ జిల్లాలోని ఓ గ్రామంలో కోతుల పేరు మీద ఏకంగా 32 ఎకరాల భూమి ఉంది. ఈ మధ్యకాలంలోనే ఈ విషయం వెల్లడైంది. ఉప్లా గ్రామంలో కోతులను చాలా ప్రేమగా చూసుకుంటారు. వాటి ఆకలి తీరుస్తారు. 

ఇటీవల గ్రామ పంచాయతీలోని రికార్డులను పరిశీలించగా కోతుల పేరు మీద భూమి ఉన్న విషయం వెల్లడైంది. దాదాపు 32 ఎకరాల భూమి ఆ గ్రామంలో ఉన్న కోతుల పేరు మీద ఉన్నట్టు గ్రహించిన గ్రామ అధికారులు... దానికి సంబంధించిన పత్రాలను కూడా గుర్తించారు. అయితే వాటిని ఎవరు, ఎప్పుడు రాశారో తెలియదని  కూడా ఉన్నాయని గ్రామ సర్పంచ్ చెప్పారు. గతంలో ఆ గ్రామంలో వంద వరకు కోతులు ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య తగ్గిపోయిందన్నారు. కోతుల పేరిట ఉన్న  32 ఎకరాల్లో అటవీ శాఖ మొక్కలు నాటిందని, గతంలో ఆ భూమిలో ఓ పాడుబడిన ఇల్లు ఉండేదని ప్రస్తుతం అది కూలిపోయిందని చెప్పారు.