48 గంటల్లో కేరళను తాకనున్న రుతుపవనాలు

48 గంటల్లో కేరళను తాకనున్న  రుతుపవనాలు

రానున్న 48 గంటల్లో నైరుతి రుతు పవనాలు కేరళను తాకనున్నాయని తెలిపింది ప్రైవేటు వాతావరణశాఖ. నైరుతి రుతు పవనాలు 48 గంటల్లో కేరళకు చేరుకుంటాయని.. సర్వ సాధారణంగా ఢిల్లీని జూన్‌ నెలాఖరుకు తాకుతాయని చెప్పింది. ఈ సారి 10 నుంచి 15 రోజులు ఆలస్యం కూడా కావొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఎల్‌నినో, భూతాపం ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలహీనపడనున్నాయన్న ఆయన.. ఈసారి 93 శాతం వర్షపాతం అంచనా వేస్తున్నామన్నారు. ఇది సాధారణం కంటే తక్కువ. సాధారణంగా రుతుపవనాల రాకకు ముందు 131.5 మి.మీ వర్షంపాతం నమోదవుతుందన్నారు. ఈసారి అది 99మి.మీ.గా మాత్రమే నమోదైందని తెలిపారు అధికారులు.