ధరణి-మల్లేశ్​, దీక్షితకు గోల్డ్​ మెడల్స్

ధరణి-మల్లేశ్​, దీక్షితకు గోల్డ్​ మెడల్స్

హైదరాబాద్, వెలుగు: మాన్‌‌‌‌సూన్ రెగట్టా నేషనల్​ ర్యాంకింగ్ సెయిలింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో   తెలంగాణ సెయిలర్లు ధరణి లావేటి–వడ్ల మహేశ్,​ దీక్షిత కొమరవెల్లి చాంపియన్స్​గా నిలిచారు. హుస్సేన్‌‌‌‌సాగర్‌‌‌‌లో ఆదివారం జరిగిన చివరి, 12 రేసులో గెలిచిన ధరణి – మల్లేష్ జంట  అండర్ 19 ఇంటర్నేషనల్ క్లాస్ మిక్స్‌‌‌‌డ్‌‌‌‌  కేటగిరీలో 17 పాయింట్లతో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌తో గోల్డ్‌‌‌‌ నెగ్గింది.

మధ్య ప్రదేశ్​కు చెందిన నాన్సీ రాయ్–- అనిరాజ్, విద్యాన్షి –మనీశ్​జంటలు వరుసగా సిల్వర్‌‌‌‌, బ్రాంజ్‌‌‌‌ గెలిచారు. ఇక,  అండర్-15 ఆప్టిమిస్ట్ గర్ల్స్‌‌‌‌ కేటగిరీ 12వ రేసులో ఐదో ప్లేస్‌‌‌‌లో నిలిచిన  దీక్షిత 57 పాయింట్లతో ఓవరాల్‌‌‌‌ టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌తో గోల్డ్‌‌‌‌ కైవసం చేసుకుంది.  షగున్ ఝా (మధ్యప్రదేశ్) సిల్వర్‌‌‌‌ నెగ్గగా,  ఆర్తి వర్మ (సీఈఎస్‌‌‌‌సీ మహారాష్ట్ర) మూడో ప్లేస్‌‌‌‌తో  బ్రాంజ్‌‌‌‌ గెలిచింది. బాయ్స్‌‌‌‌లో ఏకలవ్య బాతం (మధ్యప్రదేశ్‌‌‌‌), గోవాకు చెంది న శరణ్య జాదవ్, అజయ్ టాప్‌‌‌‌3 ప్లేస్‌‌‌‌ల్లో నిలిచారు. కాగా, ఈ టోర్నీ అన్ని కేటగిరీల్లో కలిపి తెలంగాణ సెయిలర్లు 7 గోల్డ్‌‌‌‌, 6 సిల్వర్‌‌‌‌, 3 బ్రాంజ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌ గెలిచారు.