దోబూచులాడుతున్న రుతుపవనాలు : ఓ చోట వర్షం..ఇంకో చోట ఎండ

దోబూచులాడుతున్న రుతుపవనాలు : ఓ చోట వర్షం..ఇంకో చోట ఎండ

దేశంలో రుతుపవనాలు దోబూచులాడుతున్నాయి. ఉత్తర భారతంలో విపరీతమైన వర్షాలు కురుస్తుంటే….దక్షిణాదిన వానజాడ లేక రైతులు ఆందోళన చెందుతున్నారు.రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, చత్తీస్ గడ్, ఒడిషా, బీహార్ సహా ఈశాన్య రాష్ట్రాలలో కుండపొత వర్షాలు పడుతుంటే…ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు లోటుతో కొట్టుమిట్టాడుతున్నాయి. మొత్తంగా 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదైతే….14 రాష్ట్రాల్లో లోటు వర్షపాతం రికార్డయ్యింది.

ఓవైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టేతో దేశంలో వింత పరిస్థితులు ఏర్పడ్డాయి. రుతుపవనాలు దోబూచులాడుతుండడంతో ఉత్తరాణ వర్షాలు దంచికొడుతుంటే…దక్షిణాదిన కరువు విళయ తాండవం చేస్తోంది. వర్షాలు, వరదలతో రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిషా, చత్తీస్ గడ్ రాష్ట్రాలు అతలకుతలం అయ్యాయి. నదులు, వాగులు పొంగిప్రవహిస్తుండడంతో వందల సంఖ్యలో జనం చనిపోగా… వేలమంది నిరాశ్రయులయ్యారు. అటు అస్సాంలోని బ్రహ్మపుత్రనది ఎప్పుడు లేని విధంగా పరవళ్లు తొక్కుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగిన పరిస్థితి ఏర్పడింది.

మరోవైపు ఉత్తరాదిన కరువు విలయ తాండవం చేస్తోంది. రాష్ట్రంతో పాటు ఏపీ, కేరళ, తమిళనాడు లోటు వర్షపాతంతో కొట్టుమిట్టాడుతున్నాయి. వర్షాకాలం మొదలైనా…వానజాడ లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జలాశయాలు అడుగంటిపోవడంతో…తాగునీరు కూడా కరువైన పరిస్థితి ఏర్పడింది. దేశ రాజధాని ఢిల్లీలో ఏకంగా 90శాతం లోటు వర్షపాతం రికార్డయ్యింది. అధికారిక లెక్కల ప్రకారం…దేశంలో 12శాతం లోటు వర్షపాతం నమోదైంది. సిక్కిం, దాద్రానగర్ హవేలీల్లో మాత్రం సాధారణం కన్నా ఎక్కువ వానలు పడ్డాయి.

ప్రస్తుతం రుతుపవనాలు దేశమంతా విస్తరించలేదని…రుతుపవన ద్రోని ఉత్తరం వైపు ఉండడంతో…అక్కడ వానలు ఎక్కువగా పడుతున్నాయని చెబుతోంది వాతావరణశాఖ. జూన్ లో 32.8 శాతం లోటు వర్షపాతం రికార్డయ్యిందని…గత ఐదేళ్లలో ఇదే తక్కువని అధికారులు చెబుతున్నారు. జూలై చివరి నాటికి ద్రోణి దక్షిణం వైపు వస్తుందని…అప్పుడు ఇక్కడ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. వచ్చే మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందంటున్నారు.