
ఎందుకో తెలియదు ... ప్రతి ఒక్కరికి చందమామతో ( చంద్రుడితో) ఓ విడదీయరాని అనుబంధం ఉంటుంది. రాత్రి సమయంలో అందంగా కనపడే చంద్రుడిని ఉండిపోతే భలే బాగుంటుంది కదా! వెన్నెల విరిసే రోజూ అంటే పౌర్ణమి రోజు మరింత ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఈ రోజు అక్టోబర్ 7 వ తేదీన చంద్రుడు.. సంపూర్ణ చంద్రునిగా కనిపించనున్నాడు. ఆ సమయంలో చంద్రుడు నారింజ రంగులో కనువిందు చేయనున్నాడు.
ఆశ్వయుజమాసం అక్టోబర్ 7 వతేదీన చంద్రుడు .. భూమి.. కక్ష్యకు దగ్గరగా వస్తాడని ఖగోళశాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సమయంలో చంద్రుడు కాంతివంతంగా వెలిగిపోతూ నారింజ రంగులో కనపడతాడని చెబుతున్నారు. సూర్యకాంతి భూమి వాతావరణం ద్వారా ప్రయాణించేటప్పుడు నీలం రంగు కాంతి చెల్లాచెదురుగా మారి.. ఆ సమయంలో భూమి వాతావరణం పొరల గుండా ప్రయాణించే కాంతిని వక్రీభవింపజేస్తుంది. అప్పుడు ఎరుపు ... నారింజ రంగుల కాంతితో చంద్రుడు కనువిందు చేయనున్నాడు. చంద్రుడు హోరిజోన్‌కు (క్షితిజం) దగ్గరగా ఉన్నప్పుడు.. చంద్రుడికి ... భూమికి మధ్య తక్కువ దూరం ఉంటుంది. ఆ సయమంలో చంద్రుడిపై నారింజ రంగు కాంతి పడటంతో .... చంద్రుడు ఆరంజ్ రంగులో కనపడతాడు.
ఉత్తరార్థగోళంలో శరదృతువు ప్రారంభానికి దగ్గరగా వచ్చే పౌర్ణమిని హార్వెస్ట్ మూన్ అంటారు. ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఈక్వినాక్స్ సమయంలో వచ్చే పౌర్ణమిని హార్వెస్ట్ మూన్ అని పిలుస్తారు. .. రెగ్యులర్‌గా అక్టోబర్‌లో వచ్చే పౌర్ణమిని హంటర్స్ మూన్ (వేటగాళ్ల మూన్) అని పిలుస్తారు.
అక్టోబర్ 7 తేదీల్లో ఏర్పడే (పౌర్ణమి ఘడియులు ) హార్వెస్ట్ మూన్ చాలా ప్రత్యేకమైనది ఇది సూర్యాస్తమయం రాత్రి సమయంలో ఏర్పడుతుంది. ఈ దశలో సూర్యకాంతి క్షితిజ సమాంతరంగా తక్కువగా ఉండటంతో చంద్రుడు బంగారు ...నారింజ రంగులో ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తాడు. 15 రోజుల పాటూ... చందమామ క్రమంగా తగ్గిపోతూ... ఆ తర్వాత కాంతి పెరుగుతూ... 30 రోజులకు సంపూర్ణ చందమామగా కనిపిస్తుంది. ఆ చందమామ చూసేందుకు చాలా పెద్ద సైజులో ఉన్నట్లు కనిపించడమే కాదు... ఎంతో ఆహ్లాదం కలిగిస్తుంది కూడా. ఈసారి అక్టోబర్ 7 వ తేదీన సంపూర్ణ చంద్రుడు నారింజ రంగులో కనువిందు చేయనున్నాడు..
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించేదు.