రెండు నెలల క్రితమే ప్రారంభం మూసారాంబాగ్ బ్రిడ్జిపై తవ్వకాలు 

రెండు నెలల క్రితమే ప్రారంభం మూసారాంబాగ్ బ్రిడ్జిపై తవ్వకాలు 
  • ప్రైవేట్ ​కేబుల్స్​ కోసం ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌ల ధ్వంసం.. పాదచారులకు తప్పని తిప్పలు
  •  గుంతల్లోనే నిర్మాణ వ్యర్థాలు
  • రాత్రివేళ పడిపోతున్న జనాలు పనులు పూర్తయ్యేందుకు 
  •  మరోనెల పట్టే అవకాశం   

హైదరాబాద్ సిటీ, వెలుగు : మూసారాంబాగ్ హై లెవల్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ప్రారంభించి రెండు నెలలు అవుతుందో లేదో...అప్పుడు ప్రైవేట్​కేబుల్స్​కోసం ఫుట్​పాత్​మొత్తం తవ్వేస్తున్నారు. వరదల టైంలో రాకపోకలకు ఇబ్బందులు లేకుండా నిర్మించిన ఈ బ్రిడ్జితో అంబర్‌‌‌‌పేట, మూసారాంబాగ్, దిల్‌‌‌‌సుఖ్‌‌‌‌నగర్ ప్రాంతాల ప్రజలకు ఊరట లభించింది.

అయితే, ఈ ఏడాది ఆగస్టు 31న సీఎం బ్రిడ్జిని ప్రారంభించగా, 20 రోజుల క్రితమే ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌లను తవ్వడం షురూ చేశారు. ప్రైవేట్​కంపెనీలు ఇప్పటికే ఒకవైపు సగం తవ్వగా, మరోవైపు కూడా తవ్వి కేబుల్స్​వేసుకోనున్నారు. దీనికి మరో నెల పట్టే అవకాశం ఉంది. దీంతో బ్రిడ్జిపై నడిచే పాదచారులకు కష్టాలు పడుతున్నారు. తవ్విన గుంతల్లోనే కాంక్రీట్ వ్యర్థాలు, నిర్మాణ వ్యర్థాలు వదిలేయడంతో నడవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ముఖ్యంగా రాత్రి వేళల్లో గుంతలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని, నలుగురు గుంతల్లో పడ్డారని స్థానికులంటున్నారు. కనీసం హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఖర్చు పెట్టి కట్టి రెండు నెలలకే బ్రిడ్జిని ధ్వంసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

శాఖల మధ్య ఏదీ సమన్వయం ?

ఈ ​బ్రిడ్జిని రూ.52 కోట్ల వ్యయంతో 400 మీటర్ల పొడవు, 14.5 మీటర్ల వెడల్పు, వాహనదారులతో పాటు పాదచారుల సౌకర్యార్థం 3.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌ లతో నిర్మించాలనేది ప్లాన్​. ముందుగా పబ్లిక్ అవసరాల కోసం ఒక పక్కన బ్రిడ్జి పనులు పూర్తి చేసి రెండు నెలల క్రితమే అందుబాటులోకి తెచ్చారు. కోట్లు పెట్టి పాదచారులు నడవడానికి ఫుట్‌‌‌‌పాత్​లు కూడా కట్టారు.

ఏదైనా బ్రిడ్జి నిర్మించేటప్పుడే కేబుల్స్, ఇతర భవిష్యత్​అవసరాల గురించి ఆలోచించి డిజైన్​చేస్తారు. బ్రిడ్జి నిర్మాణ టైంలోనే యుటిలిటీ కేబుళ్ల కోసం అవసరమైన ఏర్పాట్లు చేయలేదు. దీంతో ప్రైవేట్​కంపెనీలు తమ కేబుల్స్​వేసుకోవడానికి జీహెచ్​ఎంసీ నుంచి పర్మిషన్​అడగ్గా, ఓకే చెప్పింది.

దీంతో 20 రోజుల క్రితం పనులు మొదలుపెట్టారు. ఇప్పుడు ఒకవైపే పనులు సాగుతుండగా, కేబుల్ పనులు పూర్తయిన తర్వాత అంటే నెలకో..రెండు నెలలకో ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌లను తిరిగి నిర్మించే అవకాశం ఉంది. దీనివల్ల అదనపు ఖర్చు, టైం, శ్రమ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.