ఏంటీ మహిమ : బోరు కొడితే నీళ్లు కాదు పాలు వస్తున్నాయి..

ఏంటీ మహిమ : బోరు కొడితే నీళ్లు కాదు పాలు వస్తున్నాయి..

గతంలో నీటి సౌకర్యం లేని ప్రాంతాల్లో తాగునీటి కోసం బోరింగ్(చేతిపంపులు) లను ఏర్పాటుచేసేవారు.. ఇప్పుడు అవి అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి. చేతి పంపును కొడితే నీరు వస్తుంది.. మనందరికి తెలుసు.. ఆ ప్రాంతాల స్వరూపాన్ని బట్టి ఉప్పు నీరో.. లేక కొంచెం తీయగా ఉండే నీరో.. ఏదో ఒకటి మొత్తానికి బయటికి వచ్చేది.. కానీ ఉత్తరప్రదేశ్ లోని మొరదాబాద్ అనే ప్రాంతంలో నీటికోసం ఏర్పాటు చేసిన బోరింగ్( చేతిపంపు) నుంచి  పాలు వస్తున్నాయట.. విచిత్రంగా లేదు.. అక్కడి తండోపతండాలుగా కదిలి వచ్చి.. బాటిళ్లు, బిందెలు.. కంటైనర్లతో నింపుకు పోతున్నారట.. అదేంటో చూద్దాం .. 

 ఉత్తర ప్రదేశ్ లోని మొరదాబాద్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేసిన చేతి పంపు నుంచి నీటికి బదులుగా పాలు( తెల్లటి ద్రవం)  రావడం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. అచ్చం పాలలాగే ఉన్న ఈ ద్రవాన్ని చూసి ప్రజలు.. బాటిళ్లు, బిందెలు, కంటెనర్లతో నింపుకపోతున్నారట. స్థానికులు దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది వైరల్ అవుతోంది. 

బోరు నుంచి వస్తున్న తెల్లటి ఈ ద్రవాన్ని నిజంలా పాలేనా.. లేక ఇతర ఇంకేమైనా కెమికల్సా అనేది వాటిని ప్రభుత్వం ల్యాబ్ లకు పంపి.. పరీక్షిస్తే గానీ తెల్వదు. వేచిచూద్దాం.