మారటోరియం ఆఫర్ అందరికీ ఇవ్వాలి: ఆర్బీఐ

మారటోరియం ఆఫర్ అందరికీ ఇవ్వాలి: ఆర్బీఐ

టర్మ్ లోన్ ఈఎంఐల వాయిదాపై రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. డిఫాల్ట్ గా బారోవర్స్ అందరికీ మారిటోరియం ఆఫర్ చేయాలని బ్యాంక్‌లను, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలను(ఎన్‌‌‌‌బీఎఫ్‌సీ) ఆదేశించింది. కస్టమర్లు మారిటోరియం వద్దనుకునే విషయాన్ని బ్యాంక్‌లకు చెప్పితేనే, ఈఎంఐలు కట్ చేయాలని, లేదంటే డిఫాల్ట్‌‌‌‌ గా మారిటోరియం వారికి అప్లయ్ చేయాల్సిందేనని తెలిపింది. ప్రస్తుతం బ్యాంక్‌లు ఫాలో అవుతున్నవిధానానికి పూర్తి భిన్నంగా ఆర్‌బీఐ ఆదేశాలున్నాయి. ఈ మెయిల్స్ ద్వారా ఈ విషయాన్ని ఆర్‌బీఐ తెలియజేసింది. ప్రస్తుతం మారిటోరియం విధానాన్ని ఒక్కో బ్యాంక్‌ ఒక్కోలా ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని బ్యాంక్‌లు డిఫాల్ట్‌‌గా మారిటోరియం ఇస్తుండగా.. మరికొ న్ని బ్యాంక్‌లు కస్టమర్లు అడిగితేనే మారిటోరియం ఆఫర్ చేస్తున్నాయి. ఈ మారిటోరియానికి కూడా ఒక్కో బ్యాంక్ ఒక్కో పద్ధతిని పాటిస్తున్నాయి. వాటి పాలసీల్లో తేడా ఉంటోంది. మారిటోరియం కావాలనుకునే వారు ఈమెయిల్స్ లేదా బ్యాంక్ బ్రాంచ్‌కు కాల్ చేసి చెప్పాల్సి ఉంటుందని కొన్ని బ్యాంక్‌లు చెబుతున్నాయి. అయితే బ్యాంక్‌లు ఆఫర్ చేస్తోన్న ఈ విధానానికి ఆర్‌బీఐ ఫుల్ స్టాప్ పెట్టింది. డిఫాల్ట్‌‌‌‌ గా అందరికి మారిటోరియం అప్లయ్ చేయాలని చెప్పింది. ఒకవైపు మారిటోరి యం ఎంచుకుంటే, బారోవర్స్ అదనంగా భారం భరించాల్సి వస్తుందని చాలా మంది బ్యాంక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్యాంక్‌లు కూడా దీనిపై సూచనలు చేస్తున్నాయి. డబ్బులున్న వాళ్లు ఈఎంఐలు కట్టాలని సూచిస్తున్నాయి. ఇప్పుడు మారిటోరియం కింద మూడు నెలలు వాయిదా వేసుకుంటే, ఆ తర్వాత రుణ మొత్తం, దాని కాల వ్యవధి బట్టి ఈఎంఐలు చెల్లించే పిరియడ్ కూడా మూడు నెలల కంటే అదనంగా పెరుగుతుందని చాలా మంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మా రిటోరియంపై ఇప్పటికే కస్టమర్లలో ఆందోళన నెల కొన్న సంగతి తెలిసిందే. ఊరట ఇచ్చినట్టే ఇచ్చి.. అదనంగా బ్యాంక్‌లు తమపై బర్డెన్ వేస్తున్నాయని వాపోతున్నారు.

ఇరకాటంలో ఎన్‌బీఎఫ్‌సీలు..

‘చాలా బ్యాంక్‌లు లోన్పై వడ్డీ, అసలు చెల్లింపు వాయిదాను అడిగిన వారికే ఇస్తున్నాయి. కానీ ఆర్‌బీఐ సర్క్యూలర్, దీనికి పూర్తి భిన్నంగా ఉంది. కస్టమర్లు ఈ ఫెసిలిటీ వద్దని చెప్పేంత వరకు అందరికీ మూడు నెలల మారిటోరియం ఇవ్వాలని ఆర్‌బీఐ చెబుతోంది’ అని సీనియర్ బ్యాంకర్ఒకరు తెలిపారు. ఆర్‌బీఐ సర్క్యూలర్‌‌‌‌‌‌‌‌తో ఎన్‌‌‌‌బీఎ ఫ్‌సీలు ఇరకాటంలో పడ్డాయి. ఎన్‌‌‌‌బీఎఫ్‌సీ లకు ఆర్‌బీఐ సర్క్యూలర్ వర్తించదని చాలా బ్యాంక్‌లు చెబుతున్నాయి. ఎన్‌‌‌‌బీఎఫ్‌సీలు బ్యాంక్‌ల నుంచి రుణాలు తీసుకున్నా యి. వీటికి మారిటోరియం ప్రయోజనం అందడం లేదు. వీటి నుంచి రుణాలు తీసు కున్న వారికి ఈ ఫెసిలిటీ ఆఫర్ చేయాల్సి రావడంతో, వీటికి లిక్విడిటీ కొరత ఏర్పడుతోంది. మార్చి 27న జారీ చేసిన సర్క్యూ లర్‌కు భిన్నంగా ఆర్‌బీఐ తాజా ఆదేశాలు న్నాయని బ్యాంకర్లు చెబుతున్నారు. కరోనా కారణంతో దేశవ్యాప్తంగా కార్యకలాపాలు స్తంభించడంతో ప్రజలకు ఊరటగా ఆర్‌బీఐ ఈ మారిటోరియం తీసుకొచ్చింది. దీని కింద అన్ని బ్యాంక్‌లు, లెండర్లు, ఫైనాన్సియల్ ఇన్‌‌‌‌స్టిట్యూషన్స్ టర్మ్ లోన్ల పై మూడు నెలల వాయిదా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మూడు నెలల పాటు ఈఎంఐ చెల్లించకుండా కస్టమర్లు వాయిదా వేసుకోవచ్చు. ఈ మూడు నెలల తర్వాత మళ్ళీ ఈఎంఐ చె ల్లింపును కొనసాగించవచ్చు. దీనిపై ఒక్కో బ్యాంక్ ఒక్కో విధానాన్ని ఆఫర్ చేస్తోంది.