Good Health: అరటి ఆకు అన్నం .. అద్భుతమైన ఆరోగ్యం..!

Good Health: అరటి ఆకు అన్నం .. అద్భుతమైన ఆరోగ్యం..!

దక్షిణ భారతదేశంలో పండుగలు, శుభకార్యాలు, పెళ్లిళ్ల వంటి ప్రత్యేక సందర్భాల్లో అరటి ఆకుల్లో భోజనం వడ్డించడం ఒక ప్రత్యేకమైన ఆచారం. ఇది కేవలం పూర్వీకుల నుండి వచ్చిన సంప్రదాయం మాత్రమే కాదు.. పర్యావరణానికి మేలు చేసే గొప్ప పద్ధతి కూడా. ఆయుర్వేదం ప్రకారం అరటి ఆకులపై భోజనం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

ఒకప్పుడు ఇంటికొచ్చిన అతిథులకు అరటి ఆకుల్లో భోజనం పెట్టడం సంప్రదాయం. ఇప్పటికీ పండుగల వేళ చాలా మంది అరటి ఆకు ల్లోనే భోంచేస్తుంటారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ అలవాటు ఎప్పటినుంచో ఉంది. అరటి ఆకుల్లో తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు న్నాయని సైన్స్ కూడా చెబుతోంది.

దక్షిణ భారతదేశంలో అరటి ఆకు భోజనం ఒక ప్రత్యేకమైన సంప్రదాయం. ఇది కేవలం పండుగలు, శుభకార్యాలకే పరిమితం కాకుండా.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పద్ధతిగా కూడా ప్రాచుర్యం పొందింది. ఆయుర్వేదం ప్రకారం.. అరటి ఆకులపై భోజనం చేయడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.

  • అరటి ఆకుల్లో పాలీఫినోల్స్ అనే యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ ఆకుల్లో భోజనం చేయడం వల్ల అవి కూడా కొంత శాతం ఆహారంతోపాటు జీర్ణాశయంలోకి చేరుతాయి. దీనివల్ల పలు రకాల క్యాన్సర్లు, హృద్రోగాలు రాకుండా ఉంటాయి.
  • అరటి ఆకులు సహజంగా వ్యాధినిరోధకశక్తి కలిగి ఉంటాయి. ఇవి హానికరమైన బ్యాక్టీరియాను నిరోధిస్తాయి. వేడి ఆహారం ఆకుపై పడ్డప్పుడు.. .వేడి ఆహారం అరటి ఆకుపై ఉన్న మృదువైన పూతను తాకినప్పుడు.. ఒక ప్రత్యేకమైన సహజ సువాసన వస్తుంది. ఈ సువాసన వల్ల భోజనం మరింత రుచికరంగా మారుతుంది. అరటి ఆకులో ఉన్న  పోషకాలు స్వల్పంగా ఆహారంలో కలిసి మన శరీరానికి మేలు చేస్తాయి
  • అరటి ఆకులపై భోజనం చేయడం వల్ల ప్రశాంతమైన వాతావరణంలో నెమ్మదిగా తినడం అలవాటవుతుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం.. ఈ పద్ధతి భోజన సమయంలో శరీరంలో సానుకూల శక్తిని పెంచి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
  • నిత్యం వాడే ప్లేట్లను రసాయనాలతో కూడిన సబ్బులతో కడుగుతారు. అయితే అరటి ఆకులను నీటితో శుభ్రం చేసి వాడుకోవచ్చు. మంచి నీటితో కడిగితే చాలు వీటిలోని ధూళి, దుమ్ము కణాలు తొలగిపోయి శుభ్రమవుతాయి. అరటి ఆకుల్లో తింటే రసాయనాల ప్రభావం ఉండదు. వివిధ వేడుకల సందర్భం గా ప్లాస్టిక్, థర్మోకోల్ ప్లేట్లలో తినడం కంటే అరటి ఆకుల్లో తినడమే మంచిది.
  • ఇవి చాలా పెద్ద సైజులో ఉంటాయి కాబట్టి, వీటిని మనకు అవసరమైన సైజులో కట్ చేసు కోవచ్చు. అరటి ఆకులు ఆహారానికి మరింత రుచిని అందిస్తాయని చాలా మంది చెప్పే మాట.
  • ప్లాస్టిక్, డిస్పోజబుల్ ప్లేట్లతో పోలిస్తే, ఇవి పర్యావరణ హితమైనవి. భూమిలో త్వరగా కరిగిపోయే వీటిని ఎరువుగా కూడా మార్చు కోవచ్చు.
  • ఒకసారి వాడిన తర్వాత వీటిని తిరిగి శుభ్రం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నీరు కూడా వృథా కాదు. నీటితోపాటు సమయం కూడా ఆదా అవుతుంది.

వెలుగు, లైఫ్​