కరోనా తగ్గాక మరిన్ని ఇన్వెస్ట్ మెంట్లు

కరోనా తగ్గాక మరిన్ని ఇన్వెస్ట్ మెంట్లు

టీ హబ్, వీ హబ్, టీ వర్క్స్ తో స్టార్టప్స్ సాయం
కొత్త ప్రాజెక్టులతో 36 శాతం సాగు పెరిగింది
ఐటీ, ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: కరోనా తీవ్రత తగ్గాక రాష్ట్రానికి మరిన్ని ఇన్వెస్ట్ మెంట్లు వస్తాయని ఐటీ మినిస్టర్ కేటీఆర్ అన్నారు. ఇప్పటికే మన రాష్ట్రం పెట్టుబడులకు కేంద్రంగా మారిందన్నారు. సీఐఐ ఆధ్వర్యంలో ‘ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ ఆపర్ట్యూనిటీస్ ఇన్ పోస్ట్ కోవిడ్ వరల్డ్’ పేరుతో గురువారం నిర్వహించిన వర్చువల్ కాన్ఫరెన్స్‌‌లో పలువురు ఇన్వెస్టర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐఐ రూపొందించిన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్లాన్ ను రిలీజ్ చేశారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కరోనా కారణంగా ప్రపంచం పూర్తిగా డిజిటలైజేషన్ వైపు వెళుతోందని, పల్లెలకు ఇంటర్నెట్ వెళ్లిన తర్వాత ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ వంటి రంగాల్లో భారీ మార్పులు వస్తున్నాయన్నారు. టీహబ్, వీహబ్, టీవర్క్ ద్వారా స్టార్ట‌ప్ కంపెనీలను ప్రోత్సహిస్తున్నట్టు కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో నిర్మించిన సాగు నీటి ప్రాజెక్టులతో గత ఏడాదితో పోల్చుకుంటే సుమారు 36 శాతం సాగు విస్తీర్ణం పెరిగిందని ఆయనచెప్పారు.