కొత్త ఏడాదిలో మరిన్ని జాబ్స్‌‌..37 శాతం కంపెనీల్లో హైరింగ్​వెల్లడించిన సర్వే

కొత్త ఏడాదిలో మరిన్ని జాబ్స్‌‌..37 శాతం కంపెనీల్లో హైరింగ్​వెల్లడించిన సర్వే

న్యూఢిల్లీ:ఉద్యోగం కోసం ఎదురుచూసే వాళ్లకు తీపి కబురు. రాబోయే మూడు నెలల్లో కార్పొరేట్ ఇండియా హైరింగ్ సెంటిమెంట్ బలంగా ఉంటుందని వెల్లడయింది. ప్రపంచవ్యాప్తంగానూ ఇది భారీగా ఉంది. 37 శాతం మంది యజమానులు తమ ఉద్యోగులను పెంచుకోవాలని యోచిస్తున్నారు. బలంగా ఉన్న దేశీయ డిమాండే ఇందుకు కారణమని మ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రూప్ ఎంప్లాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లుక్ సర్వే వెల్లడించింది.

దీని ప్రకారం, వివిధ రంగాలకు,  ప్రాంతాలకు చెందిన దాదాపు 3,100 మంది యజమానులతో సర్వే జరిపారు.  నికర ఉపాధి దృక్పథం (ఎన్​ఈఓ) ఇండియా సహా 41 దేశాలలో అత్యధికంగా ఉంది. 2024 జనవరి–-మార్చి ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లుక్   ప్రకారం, 37శాతం కంపెనీలు కొత్తవారిని నియమించాలని అనుకుంటున్నాయి. అంటే, 2024 మొదటి క్వార్టర్​లో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని అంచనా.

"దేశీయ డిమాండ్ ఊపందుకుంది  భారతదేశాన్ని లాభదాయక ఆర్థిక వ్యవస్థగా మార్చగల ప్రైవేట్ పెట్టుబడులు పెరుగుతూనే ఉన్నాయి. రాజకీయ రంగంలో స్థిరత్వం కనిపిస్తోంది" అని మ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రూప్ ఇండియా  మిడిల్ ఈస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ గులాటి అన్నారు. 

రెండో స్థానంలో యూఎస్​

సర్వే ప్రకారం, భారతదేశం,  నెదర్లాండ్స్​లో 37 శాతం ఎన్​ఈఓతో ఎక్కువ నికర ఉపాధి అవకాశాలు ఉన్నాయి. కోస్టారికా,  యూఎస్​ 35 శాతంతో రెండవ స్థానంలో,  మెక్సికో 34 శాతం ఎన్​ఈఓతో మూడవ స్థానంలో ఉన్నాయి.  ప్రపంచ సగటు 26 శాతంగా ఉంది. ఫైనాన్షియల్,  రియల్ ఎస్టేట్ పరిశ్రమలోని వ్యాపారాలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,  కన్స్యూమర్ గూడ్స్​, సర్వీసెస్ తర్వాత అత్యధికంగా ఉపాధిని ఇచ్చేవిగా ఎదిగాయి. ఫైనాన్షియల్స్  రియల్ ఎస్టేట్ 45 శాతం  ఎన్​ఈఓ ఉంది. తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (44 శాతం)  వినియోగదారు వస్తువులు,  సేవలు (42 శాతం) ఉన్నాయి. మొదటి క్వార్టర్​లో ఎనర్జీ, యుటిలిటీస్ (28 శాతం)లో తక్కువ అవకాశాలు కనిపించాయని సర్వే పేర్కొంది. ప్రాంతాల పరంగా చూస్తే.. భారతదేశంలోని పశ్చిమ ప్రాంతం ఉద్యోగ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 39 శాతం ఎన్​ఈఓతో ఆధిపత్యం చెలాయించగా, ఉత్తరాది 38 శాతం ఎన్​ఈఓతో కాస్త వెనకబడింది.

స్కిల్స్​ కావాలి..

ఉద్యోగాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నామని, అయితే నిపుణులు దొరకడం లేదని 85 శాతం మంది యజమానులు చెప్పారు. ఈ విషయంలో జర్మనీ, గ్రీస్,  ఇజ్రాయెల్, జపాన్​ (82 శాతం) ఎక్కువగా ఇబ్బందిపడుతున్నాయి. భారతదేశంలో, 81 శాతం మంది యజమానులు నైపుణ్యం కలిగిన ప్రతిభ దొరకడం లేదని చెప్పారు. గత  సర్వే నుంచి ఇది ఒక శాతం పెరిగింది. స్కిల్డ్​ వర్క్​ఫోర్స్​ లేక రవాణా, లాజిస్టిక్స్  ఆటోమోటివ్ ఎక్కువగా ప్రభావితమయ్యాయి. తరువాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం ఉంది.  ప్రతిభను ఆకర్షించడానికి,  రిక్రూట్ చేయడానికి యజమానులు వేతనాలను పెంచుతున్నారు. సదుపాయాలనూ కల్పిస్తున్నారు. ఐటీ, డేటా, సేల్స్, మార్కెటింగ్, ఇంజినీరింగ్, ఆపరేషన్స్, లాజిస్టిక్స్,  హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రంగాలు నిపుణులు దొరక్క ఇబ్బందిపడుతున్నాయి.