కార్ల అమ్మకాల్లో ఎస్‌‌‌‌యూవీలదే హవా!

కార్ల అమ్మకాల్లో ఎస్‌‌‌‌యూవీలదే హవా!
  • ఎస్‌‌‌‌యూవీలదే హవా!
  • ప్యాసెంజర్ వెహికల్‌‌‌‌ సేల్స్‌‌‌‌లో పెరుగుతున్న వాటా
  • చిన్న కార్ల కంటే ఎస్‌‌‌‌యూవీలే బెటర్‌‌‌‌‌‌‌‌ అంటున్న కన్జూమర్లు
  • ఈ ఏడాది మొదటి 5 నెలల్లోనే 5 లక్షలకు పైగా సేల్స్‌‌‌‌

బిజినెస్‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఒకప్పుడు చిన్న కార్లపై తెగ ప్రేమ చూపించిన ఇండియన్స్, ఇప్పుడు స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్‌‌‌‌‌‌‌‌ (ఎస్‌‌‌‌‌‌‌‌ యూవీ) వైపు ఆకర్షితులవుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌‌‌‌‌‌‌‌లో అమ్ముడవుతున్న ప్రతీ నాలుగు ప్యాసెంజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెహికల్స్‌‌‌‌‌‌‌‌ (పీవీ) లో ఒకటి ఎస్‌‌‌‌‌‌‌‌యూవీనే ఉండడం దీనికి నిదర్శనం. ప్రతి రోజు ఆఫీస్‌‌‌‌‌‌‌‌లకు వెళ్లడానికి, ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా లాంగ్ ట్రిప్ వేయడానికి కూడా ఎస్‌‌‌‌‌‌‌‌యూవీలు బాగా పనిచేస్తాయని  భావిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మే మధ్య మార్కెట్‌‌‌‌‌‌‌‌ ట్రెండ్‌‌‌‌‌‌‌‌ను గమనిస్తే, పీవీ సేల్స్‌‌‌‌‌‌‌‌లో ఎస్‌‌‌‌‌‌‌‌యూవీల వాటా బాగా పెరిగినట్టు తెలుస్తోంది. కిందటేడాది మొత్తం 12 నెలల్లో 7,07,000 ఎస్‌‌‌‌‌‌‌‌యూవీ కార్లు అమ్ముడుకాగా, ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లోనే ఐదు లక్షలకు పైగా ఎస్‌‌‌‌‌‌‌‌యూవీలు సేల్ అయ్యాయి. దీంతో ప్యాసెంజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెహికల్స్‌‌‌‌‌‌‌‌ సేల్స్‌‌‌‌‌‌‌‌లో ఎస్‌‌‌‌‌‌‌‌యూవీల వాటా 35 శాతానికి ఎగిసింది. ఈ వాటా 2020 లో అమ్ముడైన మొత్తం ప్యాసెంజర్ వెహికల్స్‌‌‌‌‌‌‌‌లో 29 శాతంగా ఉంది. ఈ ఏడాది మే నెలలో అమ్ముడైన ప్యాసెంజర్ వెహికల్స్‌‌‌‌‌‌‌‌లో ఎస్‌‌‌‌‌‌‌‌యూవీల వాటా 48.5 శాతంగా ఉందంటే ఈ కార్లకు ఎంత డిమాండ్ ఉందో తెలుస్తోంది. కానీ, ఇండస్ట్రీ వర్గాలు మాత్రం ఈ సేల్స్‌‌‌‌‌‌‌‌ను పెద్దగా చూడడం లేదు. సెకెండ్ వేవ్‌‌‌‌‌‌‌‌ వలన కిందటి నెలలో కరోనా రిస్ట్రిక్షన్లు కొనసాగాయని, దీంతో ప్యాసెంజర్ వెహికల్స్ అమ్మకాలు పెద్దగా జరగలేదని చెబుతున్నాయి. అయినప్పటికీ సేల్ అయిన ప్యాసెంజర్ వెహికల్స్‌‌‌‌‌‌‌‌లో  ఎస్‌‌‌‌‌‌‌‌యూవీల వాటా ఎక్కువగా ఉండడాన్ని గమనించాలి.  

హ్యుండయ్‌‌‌‌‌‌‌‌ సేల్స్‌‌‌‌‌‌‌‌లో 45 శాతానికి ఎస్‌‌‌‌‌‌‌‌యూవీలు.. 
నేషనల్ లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ ఎత్తేసిన తర్వాత కార్లు, ఇతర ప్యాసెంజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెహికల్స్ అమ్మ కాలు పుంజుకున్నాయి. వీటిలో కూడా ఎస్‌‌‌‌‌‌‌‌యూవీలకు ఎక్కువ డిమాండ్ క్రియేట్‌‌‌‌‌‌‌‌ అయ్యిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. గత కొన్నేళ్ల నుంచి దేశంలో ఎస్‌‌‌‌‌‌‌‌యూవీ వెహికల్స్‌‌‌‌‌‌‌‌పై  ఆసక్తి పెరుగుతోందని, కరోనా సంక్షోభం వలన ఇది మరింత పెరిగిందని పేర్కొంటున్నాయి.  ‘ఇండియాలో ఎస్‌‌‌‌‌‌‌‌యూవీ రివల్యూషన్‌‌‌‌‌‌‌‌ స్టార్టవుతోంది’ అని హ్యుండయ్‌‌‌‌‌‌‌‌ మోటార్ ఇండియా డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (సేల్స్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌)  తరుణ్‌‌‌‌‌‌‌‌ గార్గ్‌‌‌‌‌‌‌‌ అన్నారు.  ప్యాసెంజర్ వెహికల్స్‌‌‌‌‌‌‌‌ సేల్స్‌‌‌‌‌‌‌‌లో ఎస్‌‌‌‌‌‌‌‌యూవీల వాటా భవిష్యత్‌‌‌‌‌‌‌‌లో మరింత పెరుగుతుందని అంచనావేశారు. దేశంలో జరిగే  హ్యుండయ్ సేల్స్‌‌‌‌‌‌‌‌లో ఎస్‌‌‌‌‌‌‌‌యూవీల వాటా 45 శాతంగా ఉందని చెప్పారు.  ఈ వాటా 2015 లో కేవలం 9 శాతంగానే ఉందని పేర్కొన్నారు. హ్యుండయ్‌‌‌‌‌‌‌‌ క్రెటా, వెన్యూ వంటి ఎస్‌‌‌‌‌‌‌‌యూవీల సేల్స్‌‌‌‌‌‌‌‌ గత కొంత కాలం నుంచి పెరుగుతోంది.  కరోనా నుంచి మార్కెట్‌‌‌‌‌‌‌‌ రికవరీ అవుతోంది కాబట్టి ఎస్‌‌‌‌‌‌‌‌యూవీల సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉందని గార్గ్‌‌‌‌‌‌‌‌ అభిప్రాయపడ్డారు. హ్యుండయ్  శుక్రవారం ఆల్కజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌యూవీని లాంచ్ చేసింది. ఈ మోడల్‌‌‌‌‌‌‌‌ కోసం ఇప్పటికే 4,000 బుకింగ్స్‌‌‌‌‌‌‌‌ వచ్చాయని కంపెనీ చెబుతోంది. ఆల్కజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధర రూ. 16.30–రూ. 19.99 లక్షల మధ్య ఉంది. ఈ వెహికల్‌‌‌‌‌‌‌‌తో కలిపి మొత్తం 4 ఎస్‌‌‌‌‌‌‌‌యూవీలను కంపెనీ ఇండియన్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి తీసుకొచ్చింది. 

ఎస్‌‌‌‌‌‌‌‌యూవీ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌లో 15 మోడల్స్‌‌‌‌‌‌‌‌..
ఎస్‌‌‌‌‌‌‌‌యూవీ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌లో కొత్త  వెహికల్స్‌‌‌‌‌‌‌‌ను లాంచ్ చేయాలని కార్ల తయారీ కంపెనీలు చూస్తున్నాయని ఎనలిస్టులు అన్నారు. మారుతి సుజుకీ ఎస్‌‌‌‌‌‌‌‌యూవీ సేల్స్‌‌‌‌‌‌‌‌ కూడా బాగానే పెరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌-మే మధ్య విటారా బ్రెజ్జా అమ్మకాలు 2.9 శాతం పెరిగాయని మారుతి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శశాంక్ శ్రీవాస్తవ అన్నారు. ఎక్కువ మోడల్స్‌‌‌‌‌‌‌‌ అందుబాటులో ఉండడం, ధరలు కూడా ఎక్కువగా లేకపోవడం, మైలేజి ఎక్కువగా వస్తుండడంతో ఎస్‌‌‌‌‌‌‌‌యూవీ వెహికల్స్‌‌‌‌‌‌‌‌కు డిమాండ్ పెరుగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎస్‌‌‌‌‌‌‌‌యూవీ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌లో 15 మోడల్స్‌‌‌‌‌‌‌‌ వరకు అందుబాటులో ఉండగా, 2012 లో కేవలం రెండు మోడల్స్‌‌‌‌‌‌‌‌ మాత్రమే అందుబాటులో ఉండేవని తెలిపారు. ఎస్‌‌‌‌‌‌‌‌యూవీ ఎంట్రీ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌లో చాలా మోడల్స్ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. లగ్జరీ కార్ల సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌లో మెర్సెడెజ్‌‌‌‌‌‌‌‌ బెంజ్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌యూవీ అమ్మకాలు పెరిగాయి. ఈ ఏడాది ఇండియా మార్కెట్‌‌‌‌‌‌‌‌ కోసం జీఎల్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌  మేబాక్‌‌‌‌‌‌‌‌కు చెందిన 50 యూనిట్లను బెంజ్ తీసుకొచ్చింది. ఈ వెహికల్స్‌‌‌‌‌‌‌‌ను ఇప్పటికే  అమ్మగలిగామని, వచ్చే ఏడాది కోసం కూడా బుకింగ్స్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటున్నామని బెంజ్ పేర్కొంది.

పెరుగుతున్న ఎస్‌యూవీ వాటా..
ఏడాది    కార్ల సేల్స్‌‌‌‌‌‌‌‌    ఎస్‌‌‌‌‌‌‌‌యూవీ వాటా(% లో)
2017    32 లక్షలు    20.8
2018    34 లక్షలు    22.0
2019    29 లక్షలు    25.5
2020    24 లక్షలు    29.0
2021    17 లక్షలు    35.4
(మొదటి 5 నెలలు)