హెచ్1బీ అప్లికెంట్లు.. సోషల్ మీడియా ప్రొఫైల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ‘పబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’గా ఉంచాలి..మరో కొత్త రూల్ తెచ్చిన ట్రంప్ సర్కార్

హెచ్1బీ అప్లికెంట్లు.. సోషల్ మీడియా ప్రొఫైల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ‘పబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’గా ఉంచాలి..మరో కొత్త రూల్ తెచ్చిన ట్రంప్ సర్కార్

న్యూయార్క్: హెచ్1 బీ వీసాకు దరఖాస్తు చేసుకునే విదేశీ ఉద్యోగులు, వారి ఫ్యామిలీ మెంబర్స్​ తీసుకోవాలనుకునే హెచ్​4 వీసా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ఖాతాలను ‘పబ్లిక్’ సెట్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంచాలని అమెరికా కొత్త రూల్​ తీసుకొచ్చింది. ఈ మేరకు డిసెంబర్ 15 నుంచి దరఖాస్తుదారుల అందరి సోషల్ మీడియా ఖాతాలను అమెరికా స్టేట్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ పరిశీలించనుంది. 

ఇప్పటికే స్టూడెంట్స్, ఎక్స్చేంజ్ విజిటర్లకు ఈ నిబంధన అమలులో ఉండగా.. ఇప్పుడు దాన్ని హెచ్1బీ, హెచ్​4 కేటగిరీలకు  వర్తింపజేయనున్నారు. ‘‘స్క్రీనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఈజీ చేయడం కోసమే  హెచ్1 బీ, హెచ్​4, ఎఫ్, ఎమ్, జే  వీసా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ‘పబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’గా మార్చాలి’’ అని ఆదేశాల్లో పేర్కొంది.

 అమెరికా వీసా అనేది హక్కు కాదని, ప్రత్యేక అనుమతి మాత్రమేనని, జాతీయ భద్రత కోసం అన్ని రకాల సమాచారాన్ని పరిశీలిస్తామని ఆ ఆదేశాల్లో వెల్లడించారు. అమెరికా తీసుకున్న ఈ తాజా నిర్ణయం ఇండియన్ ఐటీ ఎంప్లాయిస్, అక్కడ పనిచేయాలనుకున్న డాక్టర్లపై ప్రభావం చూపనుంది.  

ఆ 19 దేశాలపై చర్యలు మొదలు

అమెరికాలో సైనికులపై అఫ్గాన్ వ్యక్తి కాల్పులు జరిపిన నేపథ్యంలో 19 దేశాల పౌరుల గ్రీన్ కార్డ్, పౌరసత్వం, ఇతర ఇమ్మిగ్రేషన్ దరఖాస్తులను ట్రంప్​ సర్కారు నిలిపేసింది. ఆ దేశాల జాబితాలో అఫ్గానిస్థాన్, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్ తదితరాలు ఉన్నాయి. ఆయా దేశాలనుంచి వచ్చి అమెరికాలో గ్రీన్​కార్డు పొందిన వారిపైనా మరోసారి సమీక్ష ఉంటుందని అమెరికా తెలిపింది.