
శ్రీనగర్ : కారు ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. ఈ సంఘటన శనివారం ఉదయం జమ్మూకశ్మీర్ లో జరిగింది. కశ్మీర్ లోని రాంబన్ జిల్లాలో వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని, గాయపడ్డవారిని హస్పిటల్ కి తరలించారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 15 మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
#UPDATE: 11 people dead and 3 injured after the vehicle they were travelling in, rolled down a deep gorge at Kunda Mod in Ramban earlier today. The vehicle was going from Chandrakot to Rajgarh. #JammuAndKashmir pic.twitter.com/6CI4hmxv11
— ANI (@ANI) March 16, 2019