
పెషావర్: పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో క్లౌడ్ బరస్ట్ కారణంగా గత రెండు రోజుల్లో చనిపోయిన వారి సంఖ్య 307కు చేరింది. మృతుల్లో 279 మంది పురుషులు, 15 మంది మహిళలు, 13 మంది చిన్నారులు ఉన్నారు. బజౌర్, బునేర్, స్వాత్, మన్షేరా, షాంగ్లా, తోర్ గఢ్, బాటగ్రాం జిల్లాలు వరదలకు అత్యంత తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
ఒక్క బునేర్ జిల్లాలోనే 184 మంది వరదల కారణంగా చనిపోయారు. షాంగ్లాలో 36, మన్షేరాలో 23, స్వాత్‌లో 22, బజౌర్‌లో 21, బాటగ్రాంలో 15, లోయర్ డిర్లో ఐదుగురు, అబోటాబాద్‌లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, వరదల కారణంగా 23 మంది గాయపడ్డారని ప్రావిన్షియల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ (పీడీఎంఏ) అధికారులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని చెప్పారు.