ఆజాదీ కా అమృత్‌‌‌‌‌‌‌‌ మహోత్సవ్ వేడుకల్లో మరో మైలురాయి

ఆజాదీ కా అమృత్‌‌‌‌‌‌‌‌ మహోత్సవ్ వేడుకల్లో మరో మైలురాయి

న్యూఢిల్లీ, వెలుగు: 75 ఏండ్ల స్వాతంత్య్ర సంబురాల్లో భాగంగా కిందటేడాది మార్చి 12న  చేపట్టిన ఆజాదీ కా అమృత్‌‌‌‌‌‌‌‌ మహోత్సవ్ వేడుకల్లో మరో మైలురాయి లిఖించబడింది. హర్ ఘర్ తిరంగా పేరుతో ప్రతి ఇల్లు, ఆఫీసు, ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలన్న ఉద్దేశంతో క్రియేట్ చేసిన హర్ ఘర్ తిరంగా వెబ్ సైట్​లో 5 కోట్లకు పైగా సెల్ఫీలు అప్​లోడ్ అయ్యాయి.

ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి, దేశ ఐక్యతను చాటాలని ఈ ఏడాది జులై 22న కేంద్రం హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాంను చేపట్టింది. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు 5 కోట్ల మంది దేశ వ్యాప్తంగా, విదేశాల్లోనూ దిగిన ఫొటోలను అప్ లోడ్ చేసినట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ వెల్లడించింది. దీంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.