
న్యూఢిల్లీ : కరోనాను లైటుగా తీసుకుంటే కాటేసి తీరుద్ది. కళ్లు మూసి తెరిచే లోపు కరోనా కాటేస్తున్నందున్న సెల్ఫ్ ఐసోలేషన్, సోషల్ డిస్టెన్సింగ్ ఎంత ముఖ్యమో తెలిపే ఇన్సిడెంట్ మన దేశంలో చోటు చేసుకుంది. కరోనా వైరస్ సోకిన ఓ పెద్దాయన ఆ వైరస్ ని ఏకంగా 40 వేల మందికి అంటించేశాడు. ఇప్పుడు వాళ్లంతా ప్రాణాలు అర చేతిలో పెట్టుకునేలా చేశాడు. ఇంతకీ ఈ విషయం.. 70 ఏళ్ల వయసున్న ఆ మనిషి చనిపోయాక ఇప్పుడు తెలిసింది. పోస్ట్ మార్టంలో ఆ ముసలాయన కరోనా పాజిటివ్ రోగి అని వెలుగు చూడటంతో అంతా కంగారు పడ్డారు. ప్రభుత్వం అలర్ట్ అయి 20 గ్రామాలను క్వారంటైన్ లో ఉంచింది.
‘హోలా మొహల్లా’కి 60వేల మంది హాజరు
అతను ఈమధ్యనే ఇటలీ, జర్మనీల్లో తిరిగి నార్త్ఇండియాకు వచ్చాడు. సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండకుండా ఇష్టం వచ్చినట్లు తిరిగాడు. ‘హోలా మొహల్లా’ అనే సిక్కు ఉత్సవంలో కూడా పాల్గొన్నాడు. ఆరు రోజులపాటు జరిగిన ఆ ఫెస్టివల్ కి రోజుకి కనీసం 10 వేల మంది వచ్చేవారు. ఈ లెక్కన ‘హోలా మొహల్లా’కి మొత్తం 60 వేల మంది వరకు హాజరైనట్లు అంచనా. ఆ పండుగ ముగిసిన తెల్లారే ఆ ‘కరోనా క్యారియర్’ కాలం చేశాడు.
ట్రావెల్ హిస్టరీతో ఎంక్వైరీ
అతని డెడ్ బాడీకి పోస్ట్ మార్టమ్ చేయగా కొవిడ్-19 పాజిటివ్ అనే విషయం బయటపడింది. వారం తర్వాత ఈ ఫెస్టివల్ కి వెళ్లొచ్చిన మరో 19 మందికి కూడా కరోనా పాజిటివ్ తేలింది. దీంతో హెల్త్, పోలీసు సిబ్బంది ఉరుకులు పరుగులతో చుట్టుపక్కల ఊళ్లన్నీ గాలించేశారు. అతనితో కలిసి తిరిగిన 550 మందిని ఇప్పటివరకు గుర్తించారు. ఈ సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటంతో అతను ఉన్న గ్రామానికి ఆనుకుని ఉన్న 15 ఊళ్లను లాక్డౌన్ చేసేశారు. మరో ఐదు పల్లెల్లో లాక్ డౌన్ విధించారు. గడప గడపకి వెళ్లి శానిటైజేషన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరి ట్రావెల్ హిస్టరీలతో జల్లెడ పడుతున్నారు. ‘వచ్చాడు, పోయాడు. అన్నెంపున్నెం తెలీని మాకు అంటించిపోయాడు’ అని పల్లెల జనం శాపనార్థాలు పెడుతున్నారట!