8 లక్షల మంది స్టూడెంట్లు చదువులకు దూరం

 8 లక్షల మంది స్టూడెంట్లు చదువులకు దూరం

స్కూళ్లలో ఫిజికల్ క్లాసులకు స్టూడెంట్లు తప్పనిసరిగా హాజరుకావాల్సిన అవసరం లేదని చెప్పిన రాష్ట్ర సర్కార్ ..డిజిటల్,ఆన్ లైన్ క్లాసులను  బంద్ పెట్టింది.దీంతో అటుల ఆన్ లైన్ లేక ఇటు ఆఫ్ లైన్ లేక పిల్లలు చదువులకు దూరం అవుతున్నారు. దీంతో తల్లిదండ్రులు సర్కార్ తీరుపై మండిపడుతున్నారు. కరోనా వల్ల జూలై 1 నుంచ టీవీ,ఆన్ లైన్ పాఠాలు స్టార్ట్ కాగా..ఈ నెల ఫస్ట్ నుంచి ఫిజికల్ క్లాసులు మొదలయ్యాి. ఫిజికల్ క్లాసులు మొదలైన రోజే టీవీ, ఆన్ లైన్ పాఠాలను సర్కారు ఆపేసింది. అధఇకారిక లెక్కల ప్రకారం మంగళవారం నాటికి మొత్తంగా 45.83 శాతం స్టూడెంట్లు స్కూళ్లకు అటెండ్ గకాగా.. ఇందులో సర్కారు స్కూళ్లలో 58శాతం మంది హఆజరయ్యారు. రాష్ట్రంలో 26,285 సర్కార్ మోడల్ స్కూళ్లుండగా.. వీటిలో 21,03,741 మంది స్టూడెంట్లు చదువుతున్నారు. ఇందులో మంగళవారం నాటికి 12.30లక్షల మంది మాత్రమే హాజరయ్యారు. 8 లక్షల మందికి పైగా స్టూడెంట్లు హాజరుకాలేదు. వీరిలో దాదాపు రెండు లక్షల మంది సర్కారీ హాస్టళ్ల వాళ్లే ఉన్నారు.

ఓవరాల్ గా  ఫిజికల్ క్లాసులకు అటెండెన్స్ తక్కువే. రాష్ట్రంలో  37769 సర్కారు,ప్రైవేటు,ఎయిడెడ్ స్కూళ్లుంటే,వాటిలో  53,94లక్షల మంది చదువుతున్నారు. ఇప్పటి వరకూ 23,64లక్షల మందే ఫిజికల్  క్లాసులకు అటెండ్ అవుతున్నారు. ప్రైవేట్ స్కూళ్లలో మొత్తం 32,10లక్షల మంది స్టూడెంట్లు చదువుతుంటే..వారిలో 11లక్షలమంది మాత్రమే హాజరవుతున్నారు. మరో 21 లక్షల మంది బడులకు రావట్లేదు. కొన్నిప్రైవేట్ బడుల్లో ఆన్ లైన్ పాఠాలు కొనసాగుతుండగా..చాలా వాటిలో ఫిజికల్ క్లాసులనే నడిపిస్తున్నారు.