ఆఫ్రికా దేశంలోని మోజాంబిక్ తీరంలో పడవ మునిగి 90 మంది జలసమాధి అయ్యారు. మొజాంబిక్ ఉత్తర తీరంలో ఓవర్ లోడ్ తో వెళ్తున్న పడవ( ఫెర్రీ) మునిగిపోయి 90 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు ధృవీకరంచారు. మృతుల్లో ఎక్కువ మంది పిల్లలున్నట్లు అధికారులు వెల్లడించారు. నాంపులా ప్రావిన్స్ లోని ఓ ద్వీపానికి పడవ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో పడవలో 130 మంది ఉన్నట్లు తెలుస్తోంది. బోటు సామర్థ్యానికి మించి ప్రయాణించడం వల్లే ప్రమాదం జరిగిందని అక్కడి అధికారులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
మృతుల్లో అధిక సంఖ్యలో పిల్లలు ఉన్నట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు. అయితే కలరా వ్యాప్తి అంటూ వదంతులు రావడంతో ప్రజలు తప్పించుకుని దీవులోకి వెళ్తున్నట్లు నాంపుల ప్రావిన్స్ సెకట్రీ జైమ్ నెటో వెల్లడించారు. ఇలా వెళ్తుండగా పదబ మునిగిందంటున్నారు. మొజాంబిక్ దేశంలో 2023 అక్టోబర్ నుంచి ఇప్పటివరకు 15వేల కలరా కేసులు నమోదైనట్లు అధికారిక రిపోర్ట్స్ చెబుతున్నాయి. రిపోర్టుల ప్రకారం.. కలరాతో 32 మంది మరణించారు.