90 శాతం బెడ్లు ఖాళీ..కరోనాపై కంగారొద్దు

90 శాతం బెడ్లు ఖాళీ..కరోనాపై కంగారొద్దు

హైదరాబాద్​, వెలుగు: కరోనాపై ప్రజలు ఆందోళన చెందొద్దని, అందరి ప్రాణాలూ కాపాడుతామని పబ్లిక్​ హెల్త్​​ డైరెక్టర్​​ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 90 శాతానికిపైగా బెడ్లు ఖాళీగానే ఉన్నాయన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్​ మెడికల్​ కాలేజీలు, ఆస్పత్రుల్లో ఎక్కడెక్కడ ఎన్ని బెడ్లు ఖాళీగా ఉన్నాయన్న వివరాలను పబ్లిక్​ డొమైన్​లో పెడుతున్నామని చెప్పారు. ఆ వివరాలు చూసుకుని సమీపంలోని హాస్పిటల్​కు వెళ్లాలని సూచించారు. కొన్ని సందర్భాల్లో బెడ్ల వివరాలు తెలియక దూర ప్రాంతాలకు వెళ్తే ప్రాణాల మీదికి వచ్చే ప్రమాదముందన్నారు.

మూడు కాల్​సెంటర్లు

కరోనా ఇన్ఫర్మేషన్​ కోసం మూడు కాల్​సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. 104, 108 కాల్​సెంటర్లు ఇప్పటికే ఉండగా హోం ఐసోలేషన్​లో ఉన్నోళ్ల కోసం ప్రత్యేకంగా మరో కాల్​సెంటర్​ ఏర్పాటు చేశామన్నారు. హోం ఐసోలేషన్​లో ఉన్నవారు 180059912345 నంబర్​కు ఫోన్​ చేసి ఇన్ఫర్మేషన్​ తెలుసుకోవచ్చన్నారు. వారి కోసం కిట్లు ఇస్తున్నామని, రోజూ ఉదయం, సాయంత్రం ఫోన్​ చేసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నామని చెప్పారు. కరోనా పేషెంట్ల కోసం 90‌‌‌‌ అంబులెన్సులను అందుబాటులో ఉంచామని, గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలో 60, జిల్లాల్లో 30 అంబులెన్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు.

17 వేల బెడ్లున్నయ్​ 

రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటళ్లు, ప్రైవేట్​ మెడికల్​ కాలేజీలు, ఆస్పత్రుల్లో 17,081 బెడ్లు ఖాళీగా ఉన్నాయని శ్రీనివాసరావు చెప్పారు. ఐసోలేషన్​ బెడ్లు 11,928, ఆక్సిజన్​ బెడ్లు 3,537, ఐసీయూ బెడ్లు 1,616 ఉన్నాయన్నారు. ఐసోలేషన్​లో 737 మంది, ఆక్సిజన్​పై 733 మంది, ఐసీయూలో 374 మంది ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారని చెప్పారు.  90 శాతానికి పైగా బెడ్లు ఖాళీగా ఉన్నాయన్నారు. సిటీకి నాలుగు దిక్కులా కరోనా ట్రీట్​మెంట్​ చేసే ఆస్పత్రులున్నాయన్నారు. గచ్చిబౌలిలోని టిమ్స్​, ఎల్బీనగర్​లోని కామినేని హాస్పిటల్​, వరంగల్​ హైవేకి దగ్గరల్లో మల్లారెడ్డి మెడికల్​ కాలేజీ హాస్పిటల్​, మమత మెడికల్​ కాలేజీ హాస్పిటల్​లో ఫ్రీగా కరోనా ట్రీట్​మెంట్​ చేయిస్తామని చెప్పారు.

ప్రభుత్వానికి ఇంత అహంకారమా?