కరోనిల్ కిట్స్ పంపిణీని ఆపేసిన నేపాల్

కరోనిల్ కిట్స్ పంపిణీని ఆపేసిన నేపాల్

ఖాట్మండు: ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా గిఫ్ట్‌గా ఇచ్చిన కరోనిల్ మందుల పంపిణీని నేపాల్ నిలిపివేసింది. రాందేవ్‌కు చెందిన పతంజలి సంస్థ హై ఇమ్యూనిటీ కోసం కరోనిల్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారీ మొత్తంలో కరోనిల్ ఔషధాన్ని రాందేవ్ నేపాల్‌‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు. అయితే తాజాగా ఈ మందు వాడకానికి నేపాల్ ప్రభుత్వం బ్రేక్ వేసింది. రాందేవ్ పంపిన 1,500 కరోనిల్ కిట్‌ల తయారీలో సరైన విధివిధానాలు పాటించలేదని నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కరోనిల్ కిట్‌లో ఉండే నాసల్ ఆయిల్, ట్యాబ్లెట్‌లు కరోనా వైరస్‌ను అంతం చేయలేవని నేపాల్ సర్కార్ ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే కరోనిల్ గురించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) చేసిన వ్యాఖ్యలను కూడా గుర్తు చేసింది. కాగా కరోనిల్ మందును నేపాల్ ప్రభుత్వం అధికారికంగా బ్యాన్ వేయలేదని, దీనిపై తమకేం సమాచారం రాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ క‌ృష్ణ ప్రసాద్ పౌడ్యాల్ తెలిపారు. ఇకపోతే, కరోనిల్ కిట్‌ల పంపిణీని ఆపేసిన మొదటి దేశంగా భూటాన్ నిలవగా.. ఇప్పుడు ఈ వరుసలో నేపాల్ జాయిన్ అయ్యింది.