ఫోర్త్‌ జనరేషన్‌ ఇన్నోవేషన్‌కు ఇండియా వేదిక

ఫోర్త్‌ జనరేషన్‌ ఇన్నోవేషన్‌కు ఇండియా వేదిక
  • మొఘలులు చేయించిన అరుదైన కాయిన్ 
  • ఔరంగజేబు నుంచి నిజాంల చేతికి
  • ఎనిమిదో నిజాం ముఖరంజా నుంచి మాయం
  • జాడ తెలుసుకునేందుకు  సీబీఐ ప్రత్యేక దర్యాప్తు

సంగారెడ్డి, వెలుగు: ప్రపంచంలో ఫోర్త్‌ జనరేషన్‌ ఇన్నోవేషన్‌కు వేదికగా ఇండియా మారిందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్స్ మంత్రి జితేంద్ర సింగ్‌ అన్నారు. సోమవారం ఆయన సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని ఐఐటీ హైదరాబాద్‌లో స్టూడెంట్స్ తయారు చేసిన డ్రైవర్ లెస్ కార్‌‌ను ప్రారంభించారు. తర్వాత అందులో కూర్చుని టెస్ట్‌ డ్రైవ్‌ చేశారు. హైదరాబాద్‌లోని టీహాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్టూడెంట్లు మానవ రహిత వెహికల్స్‌ను తయారు చేశారు. డ్రైవర్ లేకుండానే నావిగేషన్ ఆధారంగా వెహికల్స్ తమ గమ్యస్థానాలకు చేరుకునేలా తయారు చేసిన ఐఐటీ హైదరాబాద్ స్టూడెంట్స్ కృషిని ఆయన అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు చేసి విజయవంతంగా ముందుకెళ్లాలని సూచించారు. అంతకుముందు క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన డ్రోన్ల ఎగ్జిబిషన్‌ను ఆయన పరిశీలించి మాట్లాడారు. రాబోయే రోజుల్లో ఐఐటీ హైదరాబాద్ వేదికగా ప్యాసింజర్ డ్రోన్ల తయారీకి పరిశోధన బృందం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే వ్యవసాయ రంగంతో పాటు కరోనా టైమ్‌లో అత్యవసర సర్వీసుల్లో డ్రోన్లను ప్రత్యేకంగా వాడారని చెప్పారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఐఐటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్ బీవీఆర్ మోహన్ రెడ్డి, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటరీ శ్రీవారి చంద్రశేఖర్, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తదితరులు 
పాల్గొన్నారు.

ఆ కాయిన్​.. చాలా ఖరీదు 

మొఘలుల కాలం నాటి 12 కిలోల ఈ అరుదైన కాయిన్​ మొఘలుల నుంచి నిజాంల చేతికి వచ్చింది. అది ప్రైవేటు ప్రాపర్టీ. ఎనిమిదో నిజాం నుంచి ఇది మాయమైంది. ఇన్నేళ్లూ పట్టించుకోకుండా వదిలేసి ఇప్పుడు దాని కోసం వెతుకుతున్నారు. చారిత్రకంగా ఎంతో విలువైన ఈ నాణెం ఇప్పుడు చాలా ఖరీదు చేస్తుంది. అది ఎక్కడున్నా తిరిగి తేవాలంటే వందల కోట్లు ఖర్చుపెట్టాలి. నిజాంల ప్రైవేటు ప్రాపర్టీ కనుక పైసలు కట్టి తెచ్చుకోవాలి. మరి ప్రభుత్వం అది చేస్తుందా చూడాలి. ఒకవేళ దాని ఆచూకీ తెలుసుకుంటే చారిత్రకంగా విలువైన సమాచారం అవుతుంది. 
-అనురాధా రెడ్డి, కన్వీనర్​, ఇంటాక్