Telusu Kada X Review: ‘తెలుసు కదా’ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ మూవీకి పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

Telusu Kada X Review: ‘తెలుసు కదా’ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ మూవీకి పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

పలు సూపర్ హిట్ చిత్రాలకు స్టైలిస్ట్‌‌‌‌గా వర్క్ చేసిన నీరజ కోన దర్శకురాలిగా పరిచయమైన చిత్రం ‘తెలుసు కదా’.  సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్‌‌‌‌గా నటించారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఇవాళ శుక్రవారం (అక్టోబర్ 17న) థియేటర్లలలో విడుదలైంది. 

12 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ, దాదాపు వంద సినిమాలకి కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పనిచేసింది నీరజ. ఈ క్రమంలోనే తన ఫస్ట్ మూవీతోనే సిద్ధు లాంటి యూత్ ఐకాన్ తో సినిమా చేసి ఆడియన్స్ ముందుకు రావడంతో మూవీపై భారీ అంచనాలున్నాయి. మరి ఈ ట్రై యాంగిల్ లవ్ స్టోరీ ఎలా ఉంది? సినిమా చూసిన ఓవర్సీస్ ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? సిద్ధు హిట్టు కొట్టాడా లేదా? అనేది ట్విట్టర్ (X) టాక్ లో తెలుసుకుందాం.

‘తెలుసు కదా’ ప్రీమియర్స్ నుంచి అధికశాతం పాజిటివ్ రెస్పాన్స్ వస్తోన్నాయి. బిగ్ స్క్రీన్ పై సిద్ధు వన్ మ్యాన్ షో అనేలా ఉందంటూ ఆడియన్స్ కామెంట్స్ పెడుతున్నారు. సినిమాలో కామెడీతో పాటుగా ఎమోషనల్, లవ్ సీన్స్ మెప్పిస్తాయని చెబుతున్నారు. ‘తెలుసు కదా’ మూవీకి ముఖ్యంగా, సిద్ధూ జొన్నలగడ్డ నటన, ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్ బలాన్ని ఇచ్చాయని ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ నుంచి టాక్ వినిపిస్తోంది. 

‘‘తెలుసు కదా హార్ట్ టచింగ్ గా ఉంది. ప్రేమ, జీవితం గురించి చెప్పే హార్ట్ టచింగ్ స్టోరీ. ఇది చాలా వాస్తవికంగా చెప్పే ప్రయత్నం చేశారు నీరజ కోన. సిద్దు, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టిలు అద్భుతంగా నటించారు. థమన్ సంగీతం సరికొత్త భావోద్వేగాన్ని ఇస్తుంది. నేటి తరం యువతకు నిజంగా కనెక్ట్ అయ్యే చిత్రం తెలుసు కదా’’ అని నెటిజన్ తన రివ్యూ ఇచ్చాడు.

ఓ నెటిజన్ తన రివ్యూ చేస్తూ.. ‘‘ తెలుసు కదా సినిమాకు మెయిన్ మూల స్తంభం హీరో సిద్ధూ జొన్నలగడ్డ. ఎమోషనల్ అండ్ కామెడీ సీన్స్లో తన అత్యుత్తమ నటనని కనబరిచాడు. కథ కొత్తగా ఉంటుంది. ట్రై యాంగిల్ లవ్ స్టోరీ డిస్కస్ చేస్తూనే, నీరజ కోన గొప్ప సందేశం ఇచ్చింది. సినిమా స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. మొత్తం టీంకు అభినందనలు’’ అని నెటిజన్ తెలిపారు. 

మరో నెటిజన్ రివ్యూ షేర్ చేస్తూ.. ‘‘ ఒక క్రేజీ రోమ్ కామ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ స్టార్ డే. సిద్ధూ జొన్నలగడ్డ కెరీర్‌లోనే అత్యుత్తమ నటనను కనబరిచారు. ఒక బ్యూటిఫుల్ అండ్ ఎమోషనల్ స్టోరీని డైరెక్టర్ నీరజ కోన చాలా బాగా డీల్ చేశారు. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి అద్భుతంగా నటించారు. ఓవరాల్గా సినిమా బాగుంది. మిస్ అవ్వకుండా చుడండి’’ అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.