
- అరెస్ట్ చేసిన పోలీసులు
వియన్నా: ఆస్ట్రియాలోని గ్రాజ్ రీజినల్ హాస్పిటల్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా బ్రెయిన్ సర్జన్ తన 12 ఏండ్ల కూతురితో పేషెంట్ తలకు డ్రిల్(రంధ్రం) చేయించింది. దాంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల ఓ రైతు(33) పొలంలో పని చేస్తుండగా తలకు పెద్ద గాయం అయ్యింది. వెంటనే గ్రాజ్ హాస్పిటల్‌లో చేరాడు. పేషెంట్ మెదడుకు ఎమర్జెన్సీ ఆపరేషన్ అవసరమైంది.
దాంతో మహిళా సీనియర్ న్యూరోసర్జన్ (58) తన అసిస్టెంట్ డాక్టర్(48)తో కలిసి ఆపరేషన్ చేపట్టారు. శస్త్రచికిత్స ముగిసే సమయంలో బ్రెయిన్ సర్జన్ తన కూతురును తీసుకువచ్చింది. ఇంట్రాక్రానియల్ ప్రెషర్ టెస్ట్ నిర్వహణలో భాగంగా బాలిక చేతికి డ్రిల్ ఇచ్చి పేషెంట్ తలపై రంధ్రం చేయించింది. విషయం బయటకు రావడంతో పోలీసులు ఇద్దరు డాక్టర్లను అరెస్ట్ చేశారు.
వారిపై శరీరానికి హాని చేయటం, ఇతర పలు అభియోగాలు మోపారు. ఈ కేసును గ్రాజ్-ఈస్ట్ డిస్ట్రిక్ట్ కోర్టు మంగళవారం విచారించింది. అయితే, సర్జన్ తరఫు అడ్వకేట్ వాదిస్తూ.. బాలిక నేరుగా డ్రిల్ చేయలేదని.. అసిస్టెంట్ డాక్టర్ కు సహకరించిందని కోర్టుకు తెలిపారు.