కర్ణాటక రిజల్ట్స్ ఎఫెక్ట్ : అదానీ గ్రూప్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి

కర్ణాటక రిజల్ట్స్ ఎఫెక్ట్ : అదానీ గ్రూప్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి

ప్రపంచ బిలియనీర్ అదానీ గ్రూప్ షేర్ల పతనం కొనసాగుతోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత అదానీ గ్రూప్ షేర్లు మరోసారి క్షీణించాయి.  మే 15వ తేది  సోమవారం  అదానీ గ్రూప్ షేర్లు 3 శాతానికి పైగా క్షీణించాయి. అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్,అదానీ ట్రాన్స్‌మిషన్ స్టాక్స్ ప్రారంభ ట్రేడింగ్‌లో ఒక్కొక్కటి 3 శాతం క్షీణించాయి. ఇతర గ్రూప్ కంపెనీలు కూడా 1-2 శాతం మధ్య నష్టాలతో ట్రేడవుతున్నాయి .

అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్ ధర 3 శాతం పడిపోయి రూ.1904.90 వద్ద  ట్రేడ్ అవుతుండగా.. అదానీ ట్రాన్స్ మిషన్ 3 శాతం క్షీణించి  రూ.850 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక అదానీ గ్రీన్ షేర్ ధర 1.60 శాతం పడిపోయి  రూ. 881.30 వద్ద ట్రేడ్ అవుతోంది.  అదానీ పవర్ షేర్ ధర 2.43 శాతం తగ్గి రూ. 235, అదానీ పోర్ట్స్ రూ.695.85 వద్ద ట్రేడ్ అవతోంది.

 కంపెనీల్లో షేర్ల అమ్మకం​ ద్వారా రూ.21 వేల కోట్లు (2.5 బిలియన్​ డాలర్లకుపైగా) సేకరించాలని అదానీ గ్రూప్​ నిర్ణయించింది. గ్రూప్‌‌‌‌‌‌కు చెందిన ఫ్లాగ్‌‌‌‌షిప్ సంస్థ అదానీ ఎంటర్‌‌‌‌ప్రైజెస్ లిమిటెడ్ రూ.12,500 కోట్లు, ఎలక్ట్రిసిటీ ట్రాన్స్‌‌‌‌మిషన్ కంపెనీ అదానీ ట్రాన్స్‌‌‌‌మిషన్ మరో రూ.8,500 కోట్లు సేకరిస్తామని కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌‌‌‌లలో తెలిపాయి. రెన్యువబుల్​ ఎనర్జీ విభాగం, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ బోర్డు కూడా నిధుల సేకరణ కోసం శనివారం సమావేశం కావాల్సి ఉండగా, ఇది ఈ నెల 24వ తేదీకి వాయిదా పడింది. ఈ క్రమంలోనే మే 15వ తేది  సోమవారం  అదానీ గ్రూప్ షేర్లు 3 శాతానికి పైగా క్షీణించాయి. అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్,అదానీ ట్రాన్స్‌మిషన్ స్టాక్స్ ప్రారంభ ట్రేడింగ్‌లో ఒక్కొక్కటి 3 శాతం క్షీణించాయి. ఇతర గ్రూప్ కంపెనీలు కూడా 1-2 శాతం మధ్య నష్టాలతో ట్రేడవుతున్నాయి.