పెయిన్ కిల్లర్స్ ట్యాబెట్లతో సైడ్ ఎఫెక్ట్స్

పెయిన్ కిల్లర్స్ ట్యాబెట్లతో సైడ్ ఎఫెక్ట్స్

ఈ మధ్య మనలో చాలామంది నొప్పి అనిపించడం ఆలస్యం పెయిన్​కిల్లర్స్​​ మింగేస్తున్నారు. పిప్పర్​మెంట్​ బిళ్ళల్లా పెయిన్​కిల్లర్స్​ వాడుతున్నారని కొన్ని స్టడీలు కూడా చెప్పాయి. నిజానికి ఇలా చిన్నదానికీ, పెద్దదానికీ మందు బిళ్లలు మింగడం వల్ల కొత్త సమస్యలు కొనుక్కుని తెచ్చుకున్నట్టే. అలాకాకుండా ఉండాలంటే వంటగదిలో ఉన్న కొన్ని వస్తువులను వాడాల్సిన రీతిలో వాడాలి. అలా చేయగలిగితే సైడ్​ ఎఫెక్ట్స్​లేకుండా కొన్ని నొప్పుల నుంచి బయటపడొచ్చు అంటున్నారు ఎక్స్​పర్ట్స్​.

 బ్లోటింగ్​, ఇన్​​ఫ్లమేషన్​, నొప్పి... ఈ ఇబ్బందులకు వెంటనే ట్యాబ్లెట్​ వేసుకుంటున్నారా. అయితే ఇక మీదట పెరుగు తినండి. పెరుగులో హెల్దీ ప్రొబయాటిక్స్​ ఉంటాయి. ఇవి డైజెస్టివ్​ సిస్టమ్​ను సరిగ్గా పనిచేసేలా చేస్తాయి. రోజుకు రెండుసార్లు  పెరుగు తింటే అరుగుదల మంచిగ ఉంటది. పొత్తికడుపు నొప్పి, నెలసరి కడుపు నొప్పుల వంటివి కూడా తగ్గిపోతాయి. కండరాలు, పంటి, తల, నరాల నొప్పులనుంచి రిలీఫ్​ కావాలంటే పుదీనా​ కావాల్సిందే. కొన్ని పుదీనా ఆకులను నమిలితే డైజెషన్​ సరిగా జరుగుతుంది. అంతేనా మైండ్​కు ప్రశాంతత, హాయి కూడా. దీనిలో ఉండే థెరపిటిక్​ ప్రాపర్టీస్​ కండరాలు, నరాలు రిలాక్స్​ అయ్యేలా చేస్తాయి. ఒళ్లు నొప్పులు, తీపులు ఉంటే కూడా తగ్గిపోతాయి. అందుకని నిద్రపోయేముందు పది లేదా పన్నెండు చుక్కల పుదీనా ఆయిల్​ వేసిన గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి.

 అల్లంలో ఉండే యాంటీఇన్​ఫ్లమెటరీ గుణాల​ వల్ల కండరాల నొప్పులు, ఆర్థరైటిస్, కడుపునొప్పి, ఛాతి, నెలసరి నొప్పుల నుంచి రిలీఫ్​ ఉంటుంది. గ్యాస్​ ఇబ్బంది నుంచి వెంటనే బయటపడాలంటే అల్లం ముక్క చప్పరించాలి. అల్లం చాయ్​ తాగితే మైగ్రేన్​ తలనొప్పుల నుంచి బయటపడొచ్చని స్టడీలు కూడా చెప్తున్నాయి. జలుబు, దగ్గు, గొంతునొప్పి, బ్రాంకైటిస్​ వంటి సమస్యల నుంచి బయటపడేయడంలో అల్లం చాలా బాగా పనిచేస్తుంది. యాపిల్​ సిడర్​ వెనిగర్​లో చాలా పోషకాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్లూయిడ్​ బాలెన్స్​ చేస్తాయి. దానివల్ల డీహైడ్రేషన్​, కండరాల నొప్పులు, తీపుల వంటివి ఉండవు. ఒక టేబుల్ స్పూన్​ యాపిల్​ సిడర్​ వెనిగర్​ను ఒక గ్లాసు గోరువెచ్చటి నీళ్లలో కలిపి రోజుకు ఒకసారి తాగితే కండరాల నొప్పులు పోతాయి.