బెంగళూరు: దక్షిణ బెంగళూరు జిల్లా కనకపుర తాలూకాలో విషాద ఘటన జరిగింది. ప్రతిభ అనే 32 ఏళ్ల వివాహిత మృతదేహం ఆమె ఇంట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్లో లభ్యమైంది. ఆమె భర్త నంజెగౌడ ఆమెను హత్య చేశాడని ప్రతిభ కుటుంబం ఆరోపించింది. అనారోగ్యం కారణంగా ఆమె స్విమ్మింగ్ పూల్లో దూకి ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరిస్తున్నాడని ప్రతిభ భర్తపై ఆమె కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నంజెగౌడ, ప్రతిభ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.
14 సంవత్సరాల క్రితం వీరి పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు మగ పిల్లలు పుట్టారు. నంజెగౌడకు కొడిగళ్లి గ్రామంలో సిమెంట్ షాప్ ఉంది. అతని వ్యాపారాలు లాభం తెచ్చిపెట్టడంతో డబ్బుకు లోటు లేకుండా ఈ కుటుంబం సంతోషంగా జీవించింది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తినప్పటికీ ఇంటి గుట్టు బయటపడకుండా ఇరు కుటుంబాలు సర్దుబాటు చేసుకున్నాయి. ఆదివారం ఉదయం ప్రతిభ ఇంటికి ఆమె సోదరి వెళ్లింది.
►ALSO READ | మంచు దుప్పటి కప్పుకున్న కాశ్మీర్.. అద్భుత దృశ్యాలు, తప్పని కష్టాలు !
ప్రతిభ రూం డోర్ ఎన్నిసార్లు తట్టినా తలుపు తీయడం లేదని ఆమె భర్త చెప్పాడు. ప్రతిభ తమ్ముడికి విషయం తెలిసి అతను కూడా ఇంటికొచ్చి చూశాడు. డోర్ బద్ధలు కొట్టి చూసినా ప్రతిభ ఆమె రూంలో కనిపించలేదు. ఇల్లంతా వెతకగా.. స్విమ్మింగ్ పూల్ ఏరియాలో ప్రతిభ డెడ్ బాడీ కనిపించింది. నంజెగౌడకు ప్రతిభ రెండో భార్య. మొదటి భార్య విషయంలో ఉన్న గొడవలు సమసిపోకపోవడంతో ప్రతిభ, నంజెగౌడకు ఈ విషయంలో చాలాసార్లు లొల్లైంది.
గత శనివారం భార్యాభర్తల మధ్య గొడవ జరిగి ప్రతిభ పుట్టింటికి కూడా వెళ్లిపోయింది. పుట్టింట్లో సర్ది చెప్పడంతో అదే రోజు రాత్రి తిరిగి నంజెగౌడ ఇంటికి వెళ్లింది. తెల్లారేసరికి ప్రతిభ మృతదేహం స్మిమ్మింగ్ పూల్ ఏరియాలో అనుమానాస్పద స్థితిలో పడి ఉంది. ఈ ఘటనపై పోలీసులు ప్రతిభ కుటుంబం ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
