పెళ్లయి రెండేళ్లవుతున్నా.. పిల్లలు పుట్టడం లేదని సూటిపోటి మాటలు.. పాపం ఈ అక్క..

పెళ్లయి రెండేళ్లవుతున్నా.. పిల్లలు పుట్టడం లేదని సూటిపోటి మాటలు.. పాపం ఈ అక్క..

గచ్చిబౌలి, వెలుగు: పెళ్లయి రెండేళ్లవుతున్నా.. పిల్లలు పుట్టడం లేదని అత్తింటివారు వేధించడంతో ఓ వివాహిత సూసైడ్​ చేసుకుంది. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లికి చెందిన కిరణ్, సౌజన్య(27)కు రెండేళ్ల క్రితం వివాహమైంది. దంపతులు నగరానికి వచ్చి టీఎన్జీవో కాలనీలో నివాసం ఉంటున్నారు. కిరణ్ సాఫ్ట్​వేర్ ఉద్యోగి. పెండ్లికి ముందు సౌజన్య ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదని భర్తతోపాటు అత్త మల్లీశ్వరి అన్నారు. తర్వాత ఆమెకు ఇష్టం లేకపోయినా ఉద్యోగం చేయించారు.

ఈ క్రమంలో 2 నెలలుగా పిల్లలు పుట్టడం లేదంటూ నిత్యం సూటిపోటి మాటలు అంటుండటంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. సోమవారం సాయంత్రం ఇంట్లోనే ఫ్యాన్​కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు డయల్ 100కు ఫోన్ చేయగా పోలీసులు వచ్చి సౌజన్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతురాలి తల్లి రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.