48 ఎంపీ కెమెరాతో మోటరోలా ‘వన్‌‌ విజన్‌‌’

48 ఎంపీ కెమెరాతో మోటరోలా ‘వన్‌‌ విజన్‌‌’

చైనా ఎలక్ట్రానిక్స్‌‌ కంపెనీ లెనోవో అనుబంధ సంస్థ మోటరోలా ఇండియా మార్కెట్లోకి గురువారం వన్ విజన్‌‌ స్మార్ట్​ఫోన్‌‌ను విడుదల చేసింది. 48 మెగాపిక్సెల్‌‌ కెమెరా, సినిమా విజన్‌‌ డిస్‌‌ప్లే, హోల్‌‌పంచ్‌‌ డిజైన్‌‌, ఆండ్రాయిడ్‌‌ వన్‌‌ ఓఎస్‌‌, సినిమా విజన్‌‌ డిస్‌‌ప్లే దీని ప్రత్యేకతలు. 4జీబీ+128 జీబీ వెర్షన్‌‌ ధర రూ.20 వేలు. ఈ నెల 27 నుంచి అమ్మకాలు మొదలవుతాయి. ఇందులో 6.3 ఇంచ్​ల డిస్‌‌ప్లే,  ఎగ్జినోస్ 9609 ఆక్టాకోర్‌‌ ప్రాసెస‌‌ర్‌‌,   48+5 ఎంపీ  డ్యూయల్​్‌‌  కెమెరా, 25 ఎంపీ సెల్ఫీ కెమెరా, 3500 ఎంఏహెచ్ బ్యాట‌‌రీ, ఫాస్ట్‌‌ చార్జింగ్‌‌ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.