
జీఎస్టీ అధికారులు కర్ణాటకలో డిజిటల్ పేమెంట్స్ డేటాతో వ్యాపారులకు నోటీసులు పంపించటం అక్కడి ప్రజలకు కష్టాలను రోజురోజుకూ పెంచుతూనే ఉంది. బెంగళూరులో బతకాలంటే ప్రస్తుతం ఫిజికల్ క్యాష్ కావాల్సిందే. చాలా చోట్ల ఇప్పటికే వ్యాపారులు చిన్న వీధి వర్తకులు కూడా ఓన్లీ క్యాష్ నో యూపీఐ పేమెంట్స్ అంటూ బోర్డులు పెట్టి మరీ బిజినెస్ చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులకు చిక్కితే తమకు వేధింపులు ఎక్కువ అవుతాయని భావిస్తున్న వ్యాపారులు దానికి తగినట్లుగానే తమ దందా స్టైల్ మార్చుకుంటున్నారు.
తాజాగా ఒక యూజర్ రెటిడ్ లో బెంగళూరు పీజీ హాస్టల్ ఓనర్స్ అతికించిన నోటీసుల గురించి షేర్ చేసుకున్నాడు. పీజీలో నివసిస్తు్న్న వ్యక్తులు డబ్బు రూపంలో రెంట్ పే చేయాలని అందులో ఉంది. ఏవైనా ఆన్ లైన్ పద్ధతుల్లో చెల్లింపులు చేయాలనుకుంటే వారు అదనంగా 12 శాతం జీఎస్టీ కలిపి చెల్లించాలని నోటీసులో తేల్చి చెప్పేస్తున్నారు నిర్వాహకులు. హాస్టళ్ల వద్ద అతికించిన ఈ పోస్టర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా చట్టాలను ఉల్లంఘించే వారిని వదిలిపెట్టకూడదని కొందరు అంటున్నారు.
SKDgeek అనే హ్యాండిల్ పేరున్న యూజర్ దీనికి సంబంధించిన ఫోటోను రెడిట్ లో పంచుకున్నారు. దీనిపై కొందరు స్పందిస్తూ జీఎస్టీ చెల్లించి దానిని తిరిగి క్లెయిమ్ చేసుకోవచ్చని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు హాస్టల్ వ్యాపారులకు యూపీఐ పేమెంట్స్ చేయాలని ప్రజల సొమ్ము తింటూ పన్నులు ఎగవేయటం ఆర్థిక వ్యవస్థకు నష్టమని మరొకరు కామెంట్ చేశారు. ఒకవేళ జీఎస్టీ వసూలు చేస్తుంటే దానికి పీజీ ఓనర్ నుంచి జీఎస్టీ బిల్ అడిగి తీసుకోవాలని అంటున్నారు.