చందానగర్ లో ఇద్దరు పిల్లలతో తల్లి మిస్సింగ్

చందానగర్ లో ఇద్దరు పిల్లలతో తల్లి మిస్సింగ్

చందానగర్, వెలుగు: చందానగర్​ పోలీస్​స్టేషన్​పరిధిలో ఇద్దరి పిల్లలతో కలిసి తల్లి అదృశ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్​ జిల్లా కేసముద్రంకు చెందిన ముల్క ప్రశాంత్​ భార్య రజిత(32) ఇద్దరు పిల్లలతో కలిసి చందానగర్​లోని ఆదర్శనగర్​లో నివాసం ఉంటున్నాడు. 

పిల్లలు జ్యోతిక(10), సుందర్​(8) సమీపంలోని కేఎస్​ఆర్​స్కూల్‌‌లో చదువుతున్నారు. సోమవారం స్కూలు నుంచి పిల్లలను బయటకు తీసుకెళ్లిన రజిత ఇంటికి రాలేదు. దీంతో భర్త ప్రశాంత్ చందానగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.