పిల్లాడు స్కూలుకు వెళ్లడంలేదని 100కు ఫోన్

పిల్లాడు స్కూలుకు వెళ్లడంలేదని 100కు ఫోన్

పిల్లాడు స్కూల్ కు వెళ్లకుండా మారాం చేస్తే…ఏదో రకంగా నచ్చ చెప్పి పంపిస్తారు తల్లిదండ్రులు. లేదంటే ఏడిస్తే ఎవరినో ఒకరిని చూపించి పట్టుకుపోతాడని భయపెడుతారు. ఓ తల్లి మాత్రం పోలీసులకు అప్పగిస్తానని బెదిరించింది. అంతేకాదు ఏకంగా 100 నంబర్ కు డయల్ చేసింది. అక్కడి వచ్చిన పోలీసులు అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్య పోయారు. ఈ ఘటన జడ్చర్లలో జరిగింది.

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన మహిళ  100కు డయల్ చేసింది.  వెంటనే వచ్చి సాయం చేయాలని కోరింది. పెట్రోలింగ్ పోలీసులు ఏం జరిగిందోనని హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్య పోయారు. స్కూలుకు వెళ్లకుండా ఇబ్బంది పెడుతున్నాడని ..ఎంత చెప్పినా వినడం లేదని చెప్పింది.

స్కూలుకు వెళ్లకపోతే 100కు కాల్ చేస్తావా అంటూ పోలీసులు అడిగిన ప్రశ్నకు… ఆ తల్లి అమాయకంగా సమాధానమిచ్చింది. ఏం చేస్తాం సార్…. అస్సలు స్కూలుకు పోవట్లేదని  చెప్పుకొచ్చింది. పోలీసులు మొదట విసుక్కున్నా… తర్వాత నవ్వుకుని అబ్బాయికి నచ్చచెప్పి బడికి పంపించారు.