పద్మారావునగర్: ఇంటి పెద్ద ట్రీట్మెంట్ కోసం తల్లీకూతుళ్ల దొంగతనాలు

పద్మారావునగర్: ఇంటి పెద్ద ట్రీట్మెంట్ కోసం తల్లీకూతుళ్ల దొంగతనాలు
  •     రైళ్లల్లో ప్రయాణికుల నగదు, బంగారం చోరీ 
  •     ఆ డబ్బుతో  గచ్చిబౌలి కార్పొరేట్​దవాఖానలో చికిత్స 
  •     పట్టుకున్న పోలీసులు  

పద్మారావునగర్​,వెలుగు : రైలు ప్రయాణికులను దోచుకుంటున్న బెంగాల్‌‌కు చెందిన తల్లీకూతుళ్లను జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 10.50 లక్షల విలువైన 70 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు రూ. 10 వేలను స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ బర్ధమాన్ జిల్లాకు చెందిన జమున బ్యాద్ (38), ఆమె బిడ్డ మాలతి బ్యాద్ (20) పాత నేరస్థులు.. బెంగాల్​లో పలు చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్న వీరిద్దరూ, జూలైలో జమున భర్త ట్రీట్​మెంట్​కోసం హైదరాబాద్ వచ్చారు. గచ్చిబౌలిలో ఓ రూమ్​రెంట్​కు తీసుకుని ఓ కార్పొరేట్​దవాఖానలో చికిత్స చేయిస్తున్నారు. అంతకుముందు నుంచే వీరు దొంగతనాలు మానేశారు. అయితే, ట్రీట్​మెంట్​ఖర్చులు పెరిగి డబ్బులు సరిపోకపోవడంతో మళ్లీ చోరీల బాట పట్టారు. 

ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే టైంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌‌లోకి వెళ్తారు. మాలతి చుట్టుపక్కల గమనిస్తుంటే జమున ప్రయాణికుల హ్యాండ్‌‌బ్యాగులు, లగేజీ బ్యాగుల జిప్పులు తెరిచి బంగారం, నగదు తస్కరిస్తుంది.. అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం చెప్పారు. రైల్వే ఎస్పీ వై. సాయి శేఖర్, డీఎస్సార్పీ ఎస్.ఎన్. జావెద్ ల పర్యవేక్షణలో, ఇన్‌‌స్పెక్టర్ బి. సాయీశ్వర్ గౌడ్, ఎస్ఐ సబ్బారెడ్డి, క్రైమ్ టీమ్ సభ్యులు, ఆర్పీఎఫ్ ఇన్‌‌స్పెక్టర్ భవానీ శంకర్ సరస్వత్ బృందం ఈ ఆపరేషన్ నిర్వహించింది. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసు అధికారులను, సిబ్బందిని రైల్వే అండ్ రోడ్ సేఫ్టీ ఐజీపీ కె. రమేష్ నాయుడు అభినందించారు.