
జీడిమెట్ల, వెలుగు: ఎగ్జామ్‌లో కొడుకు ఫెయిల్ అయ్యాడనే మనస్తాపంతో తల్లి సూసైడ్ చేసుకున్న ఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో జరిగింది. సీఐ పవన్ తెలిపిన వివరాల ప్రకారం.. గాజుల రామారంలోని బాలాజీ ఎన్‌క్లేవ్‌కు చెందిన పుష్ప జ్యోతి(41) కొడుకు ఇటీవల వచ్చిన సీఏ ఎగ్జామ్ రిజల్ట్స్ లో ఫెయిల్ అయ్యాడు. అప్పటి నుంచి మనస్తాపంతో ఉన్న పుష్ప జ్యోతి మంగళవారం రాత్రి బెడ్రూంలో ఫ్యాన్ కు ఉరేసుకుంది. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.
భర్తతో గొడవపడి భార్య..
నారాయణఖేడ్ జిల్లా చిరాక్ పల్లికి చెందిన షేక్ ఇర్ఫానా(25)కి 2017లో షేక్ హబీబ్ తో పెళ్లైంది. వీరిద్దరు బతుకుదెరువు కోసం సిటీకి వచ్చి జీడిమెట్ల పరిధిలోని బతుకమ్మ బండలో ఉంటున్నారు. షేక్ హబీబ్ లేబర్ పనిచేస్తున్నాడు. కొన్నిరోజులుగా హబీబ్ పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. బుధవారం ఈ విషయంలో ఇర్ఫానా భర్తతో గొడవపడింది. కోపంలో రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుని చీరతో ఉరేసుకుంది. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.