ఈ శ్నాక్స్ చాలా హెల్దీ

ఈ శ్నాక్స్ చాలా హెల్దీ

రుచిగా లేదని, మంచి రంగు లేదని కొన్ని రకాల ఫుడ్స్ తినరు కొందరు పిల్లలు. అలాంటి పిల్లలకు పోషకాలు ఉన్న తిండి పెట్డడం కోసం రకరకాల శ్నాక్స్ తినిపిస్తుంటారు తల్లులు. అయితే, సాయంత్రం పూట బజ్జీలు, పకోడీ వంటి శ్నాక్స్​ తిని రాత్రిళ్లు అన్నం తినడం మానేస్తారు చాలామంది పిల్లలు. అందుకని వాళ్లకు త్వరగా అరిగే శ్నాక్స్​ ఇవ్వాలి అంటోంది న్యూట్రిషనిస్ట్ సౌమ్యా భరణి. అంతేకాదు ఆమె కొన్ని హెల్దీ శ్నాక్స్​ కూడా సజెస్ట్​ చేస్తోంది. అవేంటంటే...

కార్న్​ చాట్

కొంచెం స్పైసీగా, ఉప్పగా ఉండే కార్న్​ చాట్ శ్నాక్​గా బాగుంటుంది. స్వీట్ కార్న్, ఉల్లిగడ్డలు, టొమాటోలు, కొత్తిమీర ఉంటే... ఈ చాట్​ని పావుగంటలో తయారుచేయొచ్చు. చివర్లో నిమ్మరసం పిండుకుని తింటే చాట్ టేస్టీగా ఉంటుంది. ఇందులోని కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు పిల్లలకు మంచి ఎనర్జీని ఇస్తాయి.  
పండ్ల ముక్కలు

పిల్లలకు సీజన్​లో దొరికే పండ్లను శ్నాక్​గా ఇవ్వాలి. ఉదాహరణకు ఎండాకాలంలో తర్బూజ, కర్బూజ వంటి పండ్ల ముక్కలు తినిపించాలి. ఇలాచేస్తే వాళ్లకు అన్ని రకాల పండ్లు తినడం అలవాటవుతుంది. దాంతో అన్నిరకాల పోషకాలు పిల్లలకు అందుతాయి. 


మసాలా బటర్​మిల్క్

ఈ డ్రింక్ అసిడిటీ, కడుపునొప్పి వంటి జీర్ణసమస్యల్ని తగ్గిస్తుంది. అంతేకాదు శరీరం కోల్పోయిన పోషకాలు, నీళ్లను తిరిగి అందిస్తుంది. మసాలా బటర్​మిల్క్​ని సాయంత్రాలు శ్నాక్స్ తినే​ టైంలో తాగిపిస్తే మరీ మంచిది.  

మరమరాలు, అటుకులు

ఇవి ఆకలిని తగ్గించడమే కాకుండా తొందరగా అరుగుతాయి. వీటిని పల్లీలు, ఉల్లిగడ్డలు వేసి, పోపు పెడితే టేస్టీగా ఉంటాయి. తేలికగా ఉండే ఈ శ్నాక్స్​ని పిల్లలు ఇష్టంగా తింటారు.