జోరుగా హుషారుగా షికారు పోదమ .. మోషన్ పోస్టర్‌‌‌‌ రిలీజ్

జోరుగా హుషారుగా షికారు పోదమ .. మోషన్ పోస్టర్‌‌‌‌ రిలీజ్

సంతోష్ శోభన్, ఫల్గుణి ఖన్నా జంటగా సుభాష్ చంద్ర దర్శకత్వంలో ప్రవీణ్ నంబారు, సృజన్ ఎరబోలు నిర్మిస్తున్న చిత్రం ‘జోరుగా హుషారుగా షికారు పోదమ’. ఈ మూవీ మోషన్ పోస్టర్‌‌‌‌ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌‌‌‌లో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన డైరెక్టర్ క్రిష్ మాట్లాడుతూ ‘కొవిడ్ ఫస్ట్ లాక్‌‌‌‌ డౌన్‌‌‌‌ టైమ్‌‌‌‌లో ప్రవీణ్ ఈ కథ చెప్పాడు. మూడేళ్లుగా ఈ సినిమా కోసం అతను పడుతున్న కష్టం, తన ప్యాషన్ చూస్తే ఆశ్చర్యమేసింది. 

డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా సుభాష్ ఈ కథకు న్యాయం చేశాడు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సంతోష్ శోభన్‌‌‌‌లో ఎంతో ఈజ్ ఉంటుంది. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా’ అన్నారు. సంతోష్  మాట్లాడుతూ ‘ట్రావెల్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో సాగే స్వీట్ అండ్ సింపుల్ రామ్ కామ్ సినిమా ఇది. ఈ సినిమాతో మా అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నా’ అన్నాడు. ‘సినిమా రిలీజ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నా’ అని చెప్పింది ఫల్గుణి. నిర్మాత ప్రవీణ్ మాట్లాడుతూ ‘సుభాష్‌‌‌‌కు ఇది మొదటి సినిమానే అయినా అద్భుతంగా తీశాడు. ఫల్గుణి ఎంతో సహకరించింది. 

కొత్త వారిని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే సినిమా తీశాం’ అని అన్నారు. ‘లైట్ హార్టెడ్ ట్రావెల్ మ్యూజికల్ లవ్ స్టోరీ ఇది. ఇండియా మొత్తం చుట్టి వచ్చినట్టుగా ఉంటుంది. టైటిల్ ఎంత హాయిగా ఉందో సినిమా చూస్తూ అంతే హాయిగా నవ్వుకుంటారు’ అని దర్శకుడు తెలిపాడు. డీవోపీ సాయి సంతోష్, మ్యూజిక్ డైరెక్టర్ నాగవంశీ తదితరులు పాల్గొన్నారు.