విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీయాలి : మోటివేషనల్ స్పీకర్ యండమూరి వీరేంద్రనాథ్

విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీయాలి : మోటివేషనల్ స్పీకర్ యండమూరి వీరేంద్రనాథ్

హసన్​పర్తి, వెలుగు: విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీయాలని రచయిత, మోటివేషనల్ స్పీకర్ యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం ఎల్లాపూర్ శివారులోని మాంటెసొరీ ప్రైమ్ స్కూల్ 4వ వార్షికోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాంటెసొరీ ప్రైమ్ స్కూల్ చైర్మన్ శ్రీ జోస్ నెడుంతుందం, మాంటెసొరీ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు, గాండ్ర సుధాకర్ రెడ్డి, యండమూరి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా వీరేంద్రనాథ్ మాట్లాడుతూ క్రమశిక్షణతో ముందుకు సాగడం, విలువల ఆధారిత విద్య ఆవశ్యకత గురించి ప్రేరణాత్మకంగా సందేశం ఇచ్చారు. అనంతరం మాంటెసొరీ ప్రైమ్ స్కూల్ చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధి కోసం మరింత బలంగా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ సీన్ జోస్, శివ ప్రసాద్, శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.