క్యూసీఐ, కేవీఐసీ మధ్య ఒప్పందం

క్యూసీఐ, కేవీఐసీ మధ్య ఒప్పందం

హైదరాబాద్​, వెలుగు :  ఖాదీ  కళాకారులకు మరిన్ని ప్రయోజనాలను కల్పించడానికి  క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూఐసీ)తో  ఖాదీ విలేజ్ అండ్​ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) ఒప్పందం కుదుర్చుకుంది.  అహ్మదాబాద్‌‌‌‌లోని కొచ్రాబ్ ఆశ్రమంలో క్యూసీఐ చైర్‌‌‌‌పర్సన్  జక్సే షా, కేవీఐసీ చైర్‌‌‌‌పర్సన్ మనోజ్ కుమార్ సమక్షంలో ఎంఓయూ మార్పిడి జరిగింది. 

ఖాదీ  ఖాదీ, గ్రామ పరిశ్రమల ఉత్పత్తుల నాణ్యతను పెంపొందించడం, చేతివృత్తుల వారి ఉత్పాదకతను మెరుగుపరచడం, ఖాదీ ఉత్పత్తులను ప్రోత్సహించడం వంటి విషయాల్లో కేవీఐసీకి క్యూసీఐ తన మద్దతును అందిస్తుంది.