నేపాల్‌ రాజధాని నుంచి కనిపిస్తున్న మౌంట్‌ ఎవరెస్ట్‌

నేపాల్‌ రాజధాని నుంచి కనిపిస్తున్న మౌంట్‌ ఎవరెస్ట్‌
  • లాక్‌డౌన్‌ వల్ల పొల్యూషన్‌ తగ్గడమే కారణం
  • భారీగా తగ్గుతున్న ఆస్తమా కేసులు

ఖాట్మాండూ: కరోనాను అరికట్టేందుకు ప్రపంచమంతా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. పరిశ్రమలు, కంపెనీలు అన్ని మూతపడ్డాయి. జనాలు కూడా ఎక్కువగా బయట తిరగకపోవడంతో పొల్యూషన్‌ తగ్గిపోయింది. దీంతో గాలి క్లియర్‌‌గా మారి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండలు, ఊళ్లు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేపాల్ రాజధాని ఖాట్మాండూ నుంచి మౌంట్‌ ఎవరెస్ట్‌ కనిపించింది. చౌబార్‌‌ నుంచి మౌంట్‌ ఎవరెస్ట్‌ కనిపించడంతో అభుషాన్‌ గౌతమ్‌ అనే ఫొటోగ్రాఫర్‌‌ దాన్ని ఫొటో తీసి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయడంతో నేపాల్‌ టైమ్స్‌ వాటిని షేర్‌‌ చేసింది. చౌబారా నుంచి మౌంట్‌ ఎవరెస్ట్‌కు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొన్ని దశాబ్దాల తర్వాత ఖాట్మాండు నుంచి మౌంట్‌ ఎవరెస్ట్‌ కనిపిస్తోందని ట్వీట్‌ చేశారు. అంతే కాకుండా పొల్యూషన్‌ లేని కారణంగా ఖాట్మాండూలో ఆస్తమా పేషంట్ల సంఖ్య కూడా తగ్గిపోయిందని అన్నారు. పరిశ్రమలు లేకపోవడం, వెహికిల్స్‌ తిరగకపోవడం వల్ల ఎయిర్‌‌ స్వచ్ఛంగా మారిందని, దాని వల్ల శ్వాసకోస వ్యాధులు కూడా తగ్గాయని డాక్టర్లు చెప్పారు.