కమర్షియల్ కంటెంట్‌‌తో..

కమర్షియల్ కంటెంట్‌‌తో..

రక్షిత్ అట్లూరి హీరోగా సెబాస్టియన్ దర్శకత్వంలో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మించిన చిత్రం ‘నరకాసుర’.  శుక్రవారం సినిమా విడుదల కానున్న సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘నా చిన్నప్పుడు చూసిన ఒక ఇన్సిడెంట్‌‌కు ట్రాన్స్ జెండర్ అంశాన్ని జోడించి ఈ స్టోరీ రెడీ చేశాను. నరకాసురుడు రాక్షసుడు కాకముందు గొప్ప రాజు, భూదేవి పుత్రుడు. మా కథలో హీరో కూడా అలాగే గొప్ప వ్యక్తిత్వంతో ఉంటాడు. అలా ఈ టైటిల్‌‌ను ఫిక్స్ చేశాం. 

‘పలాస’ చిత్రంలో రక్షిత్ నటన చూసి తనను హీరోగా ఎంచుకున్నాం. ఈ  సినిమా కోసం అతను మూడేళ్లు మరే సినిమా ఒప్పుకోలేదు. చాలా మెచ్యూర్డ్‌‌గా నటించాడు. మంచి సందేశం ఉంటూనే కమర్షియల్ అంశాలు తగ్గకుండా తీశా. 

మేకింగ్‌‌ సమయంలో నాకు పెద్ద యాక్సిడెంట్ జరిగి కుడి చేయి కోల్పోయాను. అయినా ఆత్మవిశ్వాసంతో సినిమా పూర్తి చేశాను. ఇక ట్రైబల్స్ లైఫ్ స్టైల్‌‌తో రాతియుగం నేపథ్యంగా ‘ట్రైబ్’ పేరుతో మూడు భాషల్లో ఓ సినిమా చేయబోతున్నా. మాధవన్, అరుణ్ విజయ్, వివేక్ ఒబెరాయ్, టొవినో థామస్ లాంటి స్టార్ కాస్ట్ అందులో ఉంటారు’ అని అన్నారు.