రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ జంటగా సందీప్ రాజ్ దర్శకత్వంలో పీపుల్స్ మీడియా సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘మోగ్లీ 2025’. మంగళవారం ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. హీరోయిన్ రష్మిక ట్రైలర్‌ను లాంచ్ చేసి బెస్ట్ విషెస్ చెప్పింది. ‘జంగిల్ బుక్’ కథలో మోగ్లీలా ప్రశాంతంగా అడవిలో ఉంటున్న కిట్టు జీవితం హీరోయిన్ రాకతో మారిపోతుంది. ఫారెస్ట్‌లో షూటింగ్ కోసం వచ్చిన ఓ సినిమా యూనిట్‌లో జాస్మిన్ ఓ సైడ్ డ్యాన్సర్. డెఫ్ అండ్ డమ్ అయిన ఆమెతో హీరో ప్రేమలో పడతాడు.
ఈలోపు ఆ ప్రాంతానికి పోలీస్ రూపంలో విలన్‌గా వస్తాడు బండి స రోజ్ కుమార్. ఆ అమ్మాయిపై అతను ఆసక్తి చూపించడంతో హీరో, విలన్ మధ్య యుద్ధం మొదలవుతుంది. తమ ప్రియురాలిని గెలుచుకునేందుకు హీరో ఎలాంటి ఫైట్ చేశాడనేదే మెయిన్ కాన్సెప్ట్ అని ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. హీరో ఫ్రెండ్ బంటీగా హర్ష చెముడు నటించాడు. కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు. టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. డిసెంబర్ 12న సినిమా విడుదల కానుంది.
