
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. నిరుద్యోగి అశోక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 8వ రోజుకు చేరుకోవడంతో ఆయనను ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కి తరలించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య సోమవారం ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగ సమస్యపై ఫోకస్ పెట్టాలన్నారు.