వరి వద్దంటే..లక్షన్నర కోట్ల కాళేశ్వరం ఎందుకు?

వరి వద్దంటే..లక్షన్నర కోట్ల కాళేశ్వరం ఎందుకు?

వరి కొనుగోలుపై మంత్రులు,ఎమ్మెల్యేలు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడుతున్నారన్నారు బీజేపీ ఎంపీ అర్వింద్. సిద్దిపేట కలెక్టర్ సుప్రీం కోర్టు ఆర్డర్ ను కూడా లెక్కచేయనంటున్నారన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన కలెక్టర్ ఇప్పటికే సస్పెండ్ కావాల్సిందన్నారు.  తెలంగాణను సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాచేస్తానన్న కేసీఆర్..ఇవాళ  సీడ్ అమ్మితే జైల్లో వేస్తానంటున్నారన్నారు. వరి విత్తనాలు అమ్మకపోతే..గంజాయి అమ్మమంటారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో గంజాయి విపరీతంగా సాగైతుందన్నారు. యూత్ కు సప్లై చేస్తున్నవారిలో టీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారన్నారు. గంజాయి సప్లై చేస్తే జైల్లో వేస్తామని ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా ఆదేశాలివ్వలేదన్నారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణి చేస్తానన్న కేసీఆర్..ఇవాళ వరి వేయొద్దని..మక్క వేయొద్దంటున్నారన్నారు. కోటి ఎకరాల మాగాణి.. లక్షన్నర కోట్ల కాళేశ్వరం మీ మామ ఫామ్ హౌస్ కోసమా?. ఖర్చు పెట్టేది దేని కోసం అని  మంత్రి హరీశ్ ను ప్రశ్నించారు.