ఎమ్మెల్సీ కవితపై ఎంపీ అర్వింద్ ఫైర్

ఎమ్మెల్సీ కవితపై ఎంపీ అర్వింద్ ఫైర్

MLC కవితపై ఫైరయ్యారు ఎంపీ అర్వింద్. కవిత భజన చూస్తే..చూసినోడికి జీర్ణం అవుతలేదన్నారు. దసరా పండక్కి దావత్ ఇవ్వని TRSనేతలు..రంజాన్కు మాత్రం ఇఫ్తార్ ఇస్తారని విమర్శించారు. శివాజీ విగ్రహం పెడితే అడ్డుకుంటూ..కేసులు పెడుతున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో హిందువులకు రక్షణ లేదన్నారు. భైంసాలో  అనేక మంది హిందువులపై దాడులు జరిగినా.. ఎమ్మెల్సీ కవిత కనీసం పరామర్శించలేదు..పట్టించుకోలేదన్నారు. అలాంటి కల్వకుంట్ల కవిత..ఇవాళ శ్రీరాముడి  జపం చేస్తుందన్నారని చెప్పారు. అది బీజేపీ వల్లే సాధ్యమైందన్నారు. కల్వకుంట్ల కుటుంబం దేవుడినే దోచుకునే రకమని విమర్శించారు.  యాదాద్రి ఆలయ అభివృద్ధి పేరుతో జేబులు నింపుకున్నారని ఆరోపించారు. హిందువులకు చేసిన అన్యాయానికి కల్వకుంట్ల కుటుంబంతో క్షమాపణ చెప్పించాల్సిన బాధ్యత హిందు సమాజంపై ఉందన్నారు. భైంసా, బోధన్ లాంటి ప్రాంతాల నుంచి హిందువులను తరిమేసి... రోహింగ్యాలకు పాస్ పోర్టులు, ఆధార్ కార్డులు ఇచ్చే పరిస్థితి ప్రస్తుతం తెలంగాణాలో ఉందన్నారు. 

మరిన్ని వార్తల కోసం..

కొడుకు ఫోటో షేర్ చేసిన కేన్ విలియమ్సన్

వామ్మో వెయ్యి సిక్సర్లే..!